Top
logo

ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపు

ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపు
Highlights

ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపునకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ...

ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపునకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కొన్ని కీలకమైన సవరణలు చేయాల్సిన నేపథ్యంలోనే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే ఆ సవరణలతో బిల్లును గట్టేక్కించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది..

స్థానాల పెంపుపై ఈ ఏడాది ఏప్రిల్ లో కేంద్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ప్రభుత్వం నోట్ పంపినట్లు..అయితే నోట్ సరిగ్గాలేదని సరైన సమాచారంతో మరోసారి నోట్ పంపాలని కేంద్ర హోంశాఖను ఎన్నికల సంఘం కోరినట్లు.. రవి కుమార్ అనే వ్యక్తి ఆర్టీఐ ద్వారా తెలుసుకున్నారు. ఇక సీట్ల పెంపుపై ఇప్పటికే కేంద్ర న్యాయ శాఖ, హోంశాఖలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఏపీలో 225 సీట్లు, తెలంగాణలో 153 సీట్లకు పెంచనున్నట్లు .. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటు పంపినట్లు తెలుస్తోంది..లైవ్ టీవి


Share it
Top