రికార్డుస్థాయిలో పెరిగిన బంగారం ధరలు

రికార్డుస్థాయిలో పెరిగిన బంగారం ధరలు
x
Highlights

బంగారం ధరలు భగభగమంటున్నాయి. గతంలో ఎప్పుడూ చూడని విధంగా పసిడి ధరలు ఆకాశానంటాయి. గత నెల రోజుల వ్యవధిలోనే 7వేల నుంచి 8వేల రూపాయలకు పెరిగింది. ప్రస్తుతం...

బంగారం ధరలు భగభగమంటున్నాయి. గతంలో ఎప్పుడూ చూడని విధంగా పసిడి ధరలు ఆకాశానంటాయి. గత నెల రోజుల వ్యవధిలోనే 7వేల నుంచి 8వేల రూపాయలకు పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారు 40వేల రూపాయల మార్క్ ను దాటింది. 40 వేల 260 రూపాయలకు చేరింది. అంతర్జాతీయ పరిణామాలు, ఆర్బీఐ నిర్ణయాలతో పాటు.. పండగ నేపథ్యంలో పసిడి కొనుగోళ్లు పెరగడంతో ధరలు చుక్కలను చూపిస్తున్నాయి. రోజురోజుకు పసిడి.. పట్టుకోండి చూద్దామంటూ పరుగులు పెడుతుంది. దీంతో బంగారం కొనాలంటేనే భయపడుతున్నారు మహిళలు.

గత ఏడాది ఇదే నెలలో 10 గ్రాముల బంగారం 30 వేలు ఉండగా.. ఇప్పుడు ఏకంగా 10 వేలకుపైగా పెరిగింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ ఏడాది మరో 15 శాతం పెరిగే అవకాశం వుంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం 40వేల మార్కును దాటిన గోల్డ్‌, త్వరలో 50వేలకు చేరే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories