కన్నడ సినీ పరిశ్రమపై ఐటీ పంజా

కన్నడ సినీ పరిశ్రమపై ఐటీ పంజా
x
Highlights

కన్నడ సినీ పరిశ్రమపై ఐటీ పంజా విసిరింది. ప్రముఖ నటులు నిర్మాతల నివాసాలపై ఐటీ అధికారులు దాడులు చేశారు.

కన్నడ సినీ పరిశ్రమపై ఐటీ పంజా విసిరింది. ప్రముఖ నటులు నిర్మాతల నివాసాలపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఇవాళ ఉదయం నుంచీ రాష్ట్ర వ్యాప్తంగా 22 ప్రాంతాలలో దాదాపు 200 మంది ఐటీ అధికారులు కన్నడ సినీ రంగానికి చెందిన ప్రముఖ నటులు, నిర్మాతల నివాసాలపై దాడులు నిర్వహించారు. వారి నుంచి కీలక పత్రాలు స్వాధీనం చేసుకోవడంతో ఇండస్ట్రీలో కలకలం రేగింది.

కన్నడ సినీ ఇండస్ట్రీ ప్రముఖులపై అధికారులు ఐటీ దాడులు నిర్వహించారు. బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు 60 చోట్ల ఏకకాలంలో దాడులు జరిపారు. సినీ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్, సీఎం సతీమణి సినీ నటి రాధిక ఇళ్లల్లోనూ సోదాలు చేశారు. వారి నుండి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వారి నుండి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ దాడులతో కన్నడ సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఉదయం ఆరు గంటల నుండి ఐటీ రైడ్స్ జరిగినట్టు తెలిసింది. ఆరు నెలల క్రితం ఇలానే ఐటీ దాడులు నిర్వహించగా ప్రముఖ టీవీ ఆర్టిస్టులు, దర్శకులు అక్రమ సంపాదనతో అధికారులకు దొరికారు.

తాజాగా రాధికతోపాటు కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్, నిర్మాతలు, రాక్‌లైన్ వెంకటేశ్, సీఆర్ మోహన్, బాక్సాఫీసుల వద్ద దుమ్మురేపుతున్న 'కేజీఎఫ్' నిర్మాత విజయ్ కిరంగదూర్ తదితరు ఇళ్లలో, కార్యాలయాల్లో దాడులు జరిగాయి. పన్ను ఎగవేత, బ్యాంకు రుణాల ఎగవేత ఇతర ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు వీరిపై ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఇప్పటివరకు జరిపిన ఐటీ దాడుల్లో అధికారులకు ఇల్లీగల్ గా కొన్ని ప్రాపర్టీస్ దొరికాయని తెలుస్తోంది. దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఐటీ అధికారులు చెబుతున్నారు. టాలీవుడ్‌లో ఇప్పటికే మహేష్‌బాబుకి షాకిచ్చిన ఐటీ ఇప్పుడు శాండిల్ వుడ్‌పైనా కొరడా ఝుళిపించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories