ఉగ్రవాదులకు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ హెచ్చరిక

ఉగ్రవాదులకు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ హెచ్చరిక
x
Highlights

ఉగ్రవాద దాడులపై అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడికి పాకిస్థాన్ తలొగ్గినట్లే కనిపిస్తోంది. పాక్‌లోని ఇస్లమిస్ట్ ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ ప్రధాని...

ఉగ్రవాద దాడులపై అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడికి పాకిస్థాన్ తలొగ్గినట్లే కనిపిస్తోంది. పాక్‌లోని ఇస్లమిస్ట్ ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాద సంస్థలు పాకిస్థాన్ భూభాగం నుంచి దాడులు చేయడాన్ని అనుమతించేది లేదని ఇమ్రాన్ స్పష్టం చేశారు. ఉగ్రవాద చర్యల్ని సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. దాయాది దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న కారణంగా అమెరికా, బ్రిటన్ తోపాటు పలు దేశాలు ఉగ్ర దాడులను పాకిస్థాన్ నివారించాలని ఒత్తిడి తీసుకువచ్చాయి. దీంతో వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ విడుదల సందర్భంగా శాంతి వచనాలు పలికిన ఇమ్రాన్ ఖాన్ తాజాగా వారి దేశంలోని ఉగ్రవాద సంస్థలకు వార్నింగ్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories