ప్రియాంకను టార్గెట్ చేసిన బీజేపీ...కాంగ్రెస్ ను దెబ్బతీయబోయి బొక్క బోర్లా...

ప్రియాంకను టార్గెట్ చేసిన బీజేపీ...కాంగ్రెస్ ను దెబ్బతీయబోయి బొక్క బోర్లా...
x
Highlights

ఎన్నికల ప్రచారం హద్దులు మీరుతోంది. యూపీపై పట్టుకోసం అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రకరకాల ఎత్తుగడలకు పోతున్నాయి. హిందూ ఓటు బ్యాంకును చాపకింద నీరులా కొల్ల...

ఎన్నికల ప్రచారం హద్దులు మీరుతోంది. యూపీపై పట్టుకోసం అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రకరకాల ఎత్తుగడలకు పోతున్నాయి. హిందూ ఓటు బ్యాంకును చాపకింద నీరులా కొల్ల గొడుతున్న కాంగ్రెస్ ను దెబ్బతీయబోయి బీజేపీ బొక్క బోర్లా పడింది ఇంతకీ బీజేపీ ఏం చేసింది? ప్రియాంకపై ప్రయోగించిన ఆ అస్త్రం ఏంటి? అది ఎలా వికటించింది?

ఎన్నికల యుద్ధం పతాక స్థాయికి చేరుకుంటోంది. హిందూత్వ కార్డును ఉపయోగిస్తున్న బీజేపీ అదే కార్డు ప్రయోగించి కాంగ్రెస్ కూడా హిందూ ఓటు బ్యాంకులోకి చొరబడటంతో మండి పడుతోంది. రెండు జాతీయ పార్టీల మధ్య ప్రచార పర్వం హద్దు మీరుతోంది. దాంతో యూపీని గెలవాలనుకుంటున్న ప్రియాంక బీజేపీ సేనల టార్గెట్ గా మారిపోయారు. కాంగ్రెస్ కూడా హిందూత్వ నినాదం అందుకుని చాపకింద నీరులా యూపీలో చొరబడుతుండటంతో అప్రమత్తమైన బీజేపీ కట్టడి చేసే మార్గాల కోసం వెతుకుతోంది. రాహుల్ ఇప్పటికే శివభక్తుడినని చెప్పడం, ఆలయాల్లో పూజలు చేయడం, హిందూ వేష ధారణలో కనిపించడంతో బీజేపీ అక్కసుతో రగిలిపోతోంది. ఎలాగైనా కాంగ్రెస్ జోరును తిప్పి కొట్టాలన్న వ్యూహంతో అసహనంగా ఉంది.

సమయం దొరికినప్పుడల్లా రాహుల్, ప్రియాంకల వేష ధారణపై వ్యంగ్యోక్తులతో ఎటాక్ చేస్తోంది. ఇంత వరకూ పర్వాలేదు హిందూ కంచుకోటలు కాంగ్రెస్ వైపు మళ్లు తున్నాయన్న అక్కసుతో హద్దు మీరి ఎదురు దాడి కూడా మొదలు పెట్టింది. సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రియాంకపై యుద్ధం చేస్తోంది. మోడీ గవర్నమెంట్ అనే పేరుతో నడిపే ఓ ఫేస్ బుక్ ఎక్కౌంట్ నుంచి ప్రియాంకకు సంబంధించిన ఒక ఫొటో అప్ లోడ్ చేసింది. దానికి ఓ సెటైరికల్ కాప్షన్ పెట్టింది. జన్యుధారుడు దత్తత్రేయుని ప్రతిరూపం అయిన సోదరుడి జన్యుధారీ సోదరి మెడలో శిలువ వేసుకుందంటూ బీజేపీ సోషల్ మీడియా టీమ్ కామెంట్ చేసింది.

గంగానది ముద్దు బిడ్డనని చెప్పుకునే ప్రియాంక మెడలో మాత్రం హిందూ సంప్రదాయమైన మంగళ సూత్రం ధరించదంటూ ఎత్తిపొడిచింది బీజేపీ టీమ్. ఈ కామెంట్ ఇతర సోషల్ మీడియా గ్రూపులలోనూ వైరల్ గా మారింది.అయితే బీజేపీ అత్యుత్సాహం ఎంతో సేపు నిలవలేదు కొద్ది సేపటికే అది మార్ఫింగ్ ఫొటో అన్న విషయం లీక్ అయింది. వాస్తవానికి ప్రియాంక ఆ ఫొటోలో పెండెంట్ ధరించింది. అయితే గిట్టని వారు పెండెంట్ స్థానంలో శిలువను మార్ఫింగ్ చేసి జన్యుధారి సోదరి అంటూ సెటైరికల్ కామెంట్లు పెట్టారు. ప్రియాంక ఒరిజినల్ ఫొటోను హఫ్ఫింగ్టన్ పోస్ట్ ఇండియా పత్రిక ప్రచురించడంతో అసలు విషయం బయటకు లీక్ అయింది. అంతేకాదు ఏఎఫ్ పీ వార్తా సంస్థ కూడా ప్రియాంక ఒరిజినల్ ఫొటోను ప్రచురించడంతో ఇదంతా ఫేక్ అని తేలిపోయింది.


Show Full Article
Print Article
Next Story
More Stories