ప్రధాని పదవి రేసులో లేను: నితిన్‌ గడ్కరీ

ప్రధాని పదవి రేసులో లేను: నితిన్‌ గడ్కరీ
x
Highlights

లోక్‌సభ ఎన్నికల తరువాత కేంద్రంలో బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, మిత్రుల తోడ్పాటుతో ముందుకెళతామని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ధీమా...

లోక్‌సభ ఎన్నికల తరువాత కేంద్రంలో బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, మిత్రుల తోడ్పాటుతో ముందుకెళతామని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ధీమా వ్యక్తం చేశారు. ఇక ఇటివల భారత ప్రధాని రేసులో హట్ టాపిగ్‌గా నితిన్‌ గడ్కరీ పేరు వినిపించింది. దినికి సమాధానం ఇస్తూ ప్రధాని పదవి రేసులో లేనని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. అసలు బీజేపీలో వ్యక్తుల ప్రాబల్యం ఉండదని అన్నారు. ఇక పశ్చిమ బెంగాల్‌, ఒడిసా రాష్ట్రాల్లో అధిక సీట్లు సాధిస్తామని నితిన్‌ గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎందుకంటే గత ఐదేళ్లలో బీజేపీ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ఎన్నికలకు వెళ్లామని గడ్కరీ చెప్పుకొచ్చారు. ఇక మొత్తానికి సార్వత్రిక ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసి మరోసారి భారత ప్రధానిగా నరేంద్రమోడీ పగ్గాలు చేపడతారని నితిన్‌ గడ్కరీ జోస్యం చెప్పారు. కాగా భారత ప్రధానిని దొంగ అనడం సరికాదని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీని ఉద్దేశించి కేంద్ర మంత్రి గడ్కరీ చురకలు వేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories