Top
logo

టీడీపీలో మానసికంగా వేధించారు: బుట్టా రేణుక

టీడీపీలో మానసికంగా వేధించారు: బుట్టా రేణుక
Highlights

ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి...

ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థంపుచ్చుకున్నారు బుట్టా రేణుక. రేణకతో పాటు ఎమ్మెల్సీ మాగుంట, వంగా గీత, ఆదాల ప్రభాకర్ వైసీపీలో చేరారు. జగన్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జగన్‌ను సీఎం చేయడమే తమ లక్ష్యమన్నారు నేతలు.

ఈ సందర్భంగా బుట్టరేణుక మీడియాతో మాట్లాడుతూ టీడీపీ తనను మోసం చేసిందని ఎంపీ బుట్టా రేణుక అన్నారు. టీడీపీలో బీసీలకు అన్యాయం జరిగిందని కర్నూలు బీసీ సిట్టింగ్‌ సీట్లు ఓసీలకు ఇచ్చారని అన్నారు. వైసీపీ పార్టీలోకి తిరిగి రావడం మళ్లీ సొంత ఇంటికి వచ్చినంత ఆనందంగా ఉందని బుట్టరేణుక అన్నారు. టీడీపీలో తనను మానసికంగా వేధించారని, టీడీపీ అధిష్టానం చెప్పే మాటలకు, చేతలకు అసలు ఎక్కడా పొంతన లేదన్నారు. బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీలో బీసీ మహిళ అయిన తనను అవమానించారన్నారు.

Next Story

లైవ్ టీవి


Share it