Top
logo

ప్రత్యర్థులకు ఏకే47తో సమాధానం చెబుతా..

ప్రత్యర్థులకు ఏకే47తో సమాధానం చెబుతా..
X
Highlights

ప్రత్యర్థులు ఎంతటీ వారైనా సరే ఏకే 47తో సమాధానం చెబుతానంటూ రాజస్థాన్ బీఎస్పీ నేత జగత్ సింగ్ సంచలన వ్యాఖ్యాలు చేశారు. రాంగఢ్‌లో నిర్వహించిన ఓ ర్యాలీలో పాల్గోన్న జగత్ ఈ వ్యాఖ్యాలు చేశారు.

ప్రత్యర్థులు ఎంతటీ వారైనా సరే ఏకే 47తో సమాధానం చెబుతానంటూ రాజస్థాన్ బీఎస్పీ నేత జగత్ సింగ్ సంచలన వ్యాఖ్యాలు చేశారు. రాంగఢ్‌లో నిర్వహించిన ఓ ర్యాలీలో పాల్గోన్న జగత్ ఈ వ్యాఖ్యాలు చేశారు. అయితే దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. దీంతో తీవ్ర వివాదం రేగుతుంది. అయితే ఈ వీడియోలో తాను మాట్లాడుతూ నేను అస్సలు వెనక్కి తిరిగి పిరికివాడిలా పారిపోను. మీ మీద కాల్పులు జరిపితే మొదటి బుల్లెట్ నా గుండెల మీదనే పడుతుంది. ఇక నా పై రాళ్లు రువ్వవారికి ఏకే47తోనే సమాధానం చెబుతా అన్నాడు. అశోక్ గెహ్లాట్, వసుంధరరాజే, భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఇంక ఎవరైనా సరే ఇక్కడి నుంచి బయటకు పంనేస్తా అని బీఎస్పీ నేత జగత్ వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ పార్టీ స్పందిస్తూ ఇప్పుడు పార్టీ మారి చాలా అహంకార పూరితంగా జగత్ మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడింది. గతంలో జగత్ సింగ్ భరత్ పూర్ జిల్లా కమన్ స్థానం నుంచి బీజేపీ శాసనసభ్యుడిగా కొనసాగారు. తాజాగా బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పి బీఎస్పీ పార్టీ తీర్థంపుచ్చుకున్నారు. కాగా ఈ నెల 28న అల్వార్ లో జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికల్లో జగత్ సింగ్ బీఎస్పీ పార్టీ నుండి బరిలో దిగుతున్పారు.

Next Story