నేను, నా కోడలు పోటీ చేయకపోవడానికి కారణాలివీ.: మురళీ

నేను, నా కోడలు పోటీ చేయకపోవడానికి కారణాలివీ.: మురళీ
x
Highlights

రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్‌. అసెంబ్లీ, పార్లమెంటు టిక్కెట్ల కోసం అభ్యర్ధులు పోటాపోటీపడుతున్న...

రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్‌. అసెంబ్లీ, పార్లమెంటు టిక్కెట్ల కోసం అభ్యర్ధులు పోటాపోటీపడుతున్న తరుణంలో టికెట్ తనదే అయినప్పటికీ, తాను తిరిగి పోటీ చేయడం లేదన్నారు. కేవలం సేవా కార్యక్రమాలు విస్తృతం చేసుకునేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. స్వచ్ఛందంగానే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాని మురళీ స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయనని చంద్రబాబుకు కూడా చెప్పెశానన్నారు. చంద్రబాబు ఆదేశిస్తే ఏపీ రాష్ట్రం మొత్తం తిరిగి ఎన్నికల ప్రచారం చేస్తానని మురళీ చెప్పారు. కేవలం వయసురిత్యా రాజమండ్రి నుంచి పోటీకి దూరమవుతున్నానని. తాను ఏతప్పూ చేయలేదన్నారు. తన కోడలు రూపాదేవి కూడా టిక్కెట్ ఆశించడం లేదని మురళీ మోహన్ స్పష్టం చేశారు. అయితే రూపాదేవి వచ్చే రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తారని చాలాకాలంగా వినిపిస్తోంది. అయితే రూపాదేవి ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే విషయంలో స్పష్టత లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories