అందుకే హార్దిక్‌ చెంప చెళ్లుమనిపించా..

అందుకే హార్దిక్‌ చెంప చెళ్లుమనిపించా..
x
Highlights

కాంగ్రెస్‌నేత, పటీదార్‌ ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్‌ గుజరాత్‌లోని సురేంద్రనగర్‌లో శుక్రవారం ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తుండగా హార్దిక్‌ పటేల్‌ కు చేదు...

కాంగ్రెస్‌నేత, పటీదార్‌ ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్‌ గుజరాత్‌లోని సురేంద్రనగర్‌లో శుక్రవారం ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తుండగా హార్దిక్‌ పటేల్‌ కు చేదు అనుభవం ఎదురైంది. అయితే ఈ సభలో హార్దిక్‌ పటేల్‌ మాట్లాడుతుండగా తరుణ్‌ గజ్జర్‌ హఠాత్తుగా చెంప చెల్లుమని పించిన విషయం తెలిసిందే. కాగా ఈ నేపథ్యంలో హార్ధిక్ ని ఎందుకు కొట్టాడో వివరణ ఇచ్చాడు ఆ వ్యక్తి. అయితే పటీదార్ ఉద్యమం హోరాహోరిగా సాగుతున్నప్పుడు తన భార్య గర్భవతి అని తనకు ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నాను. కాగా ఆ సమయంలోనే పటీదార్ ఉద్యమం వల్ల తాను చాలా ఇబ్బంది పడ్డానని చెప్పారు. అయితే హార్దిక్‌ పటేల్‌ దాడి చేయాలని అనుకున్నా కానీ ఎలాగైనా హార్ధిక్ కు తగిన బుద్ధి చెప్పాలని గట్టిగా భావించాను అని హార్దిక్‌ ను చెంప దెబ్బ కొట్టిన తరుణ్‌ గజ్జర్‌ అనే వ్యక్తి చెప్పిన మాటలు. సురేంద్రనగర్‌ ఎస్పీ మహేంద్ర బాఘేదియా మాట్లాడుతూ చట్టప్రకారం అతడిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories