భర్త పోయిన బాధను దిగమింగుకుని...ఓటు బాధ్యతను గుర్తు చేసిన ఉమ

భర్త పోయిన బాధను దిగమింగుకుని...ఓటు బాధ్యతను గుర్తు చేసిన ఉమ
x
Highlights

కట్టుకున్న భర్త చనిపోయినా ఆ మహిళ పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుంది. ఒకపక్క ఇంట్లో భర్త మృతదేహన్ని ఉంచి ఆ బాధను దిగమింగుకుని ఓటు...

కట్టుకున్న భర్త చనిపోయినా ఆ మహిళ పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుంది. ఒకపక్క ఇంట్లో భర్త మృతదేహన్ని ఉంచి ఆ బాధను దిగమింగుకుని ఓటు వేసింది. అందరికీ ఓటు విలువను గుర్తు చేసింది. గుండెల్లో అంత భారాన్ని మోస్తూ పోలింగ్ కేంద్రం వరకూ వెళ్లి ఓటు వేసిన ఆ మహిళను గ్రామస్థులంతా అభినందిస్తున్నారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలం పేరూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు, ఉమ దంపతులు గత కొంత కాలంగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. స్థానిక ఎన్నికల సందర్భంగా ఓటు వేసేందుకు ఇద్దరు పేరూరుకు వచ్చారు. అస్వస్థతకు గురైన శ్రీనివాస్ ను ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే చనిపోయాడు. అయినా, భార్య ఉమ ఇంట్లో భర్త పార్థివ దేహన్ని ఉంచుకుని పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసింది.

తన భర్త ఇకలేడని, తిరిగి రాడని తెలిసి ఉమ కుప్పకూలిపోయింది. ఒకవైపు తమ ఇంట్లో విషాదఛాయలు అలముకున్నా దు:ఖాన్ని పంటిబిగువనా ఆపుకుని, బరువెక్కిన గుండెతో పోలింగ్ బూత్ వైపు అడుగులు వేసింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ రెండో విడత పోలింగ్‌లో తన ఓటు హక్కును వినియోగించుకుంది. ఇంత కష్టంలోనూ ఓటు హక్కు పట్ల తనకు ఉన్న బాధ్యతను చాటుకుంది. భర్త మృతిచెందినా, ఉమ తన ఓటు హక్కు వినియోగించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచిందంటూ గ్రామస్థులు అభినందిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories