సత్తెనపల్లిలో హైదరాబాద్ తరహా ట్యాంక్ బండ్.. 36 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం

సత్తెనపల్లిలో హైదరాబాద్ తరహా ట్యాంక్ బండ్.. 36 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం
x
Highlights

ట్యాంక్ బండ్ అంటే అందరికీ గుర్తొచ్చేది హైదరాబాద్. హుస్సేన్ సాగర్ పై ఉన్న ట్యాంక్ బండ్‌కు ఓ గుర్తింపు తెచ్చింది. తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన ఎన్టీఆర్. ట్యాంక్ బండ్ మీద మహనీయుల విగ్రహాలు పెట్టి హుస్సేన్ సాగర్‌లో బుద్ధ భగవానుడి విగ్రహాన్ని ప్రతిష్టించి ఎన్నో అందాలను అద్దారు.

ట్యాంక్ బండ్ అంటే అందరికీ గుర్తొచ్చేది హైదరాబాద్. హుస్సేన్ సాగర్ పై ఉన్న ట్యాంక్ బండ్‌కు ఓ గుర్తింపు తెచ్చింది. తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన ఎన్టీఆర్. ట్యాంక్ బండ్ మీద మహనీయుల విగ్రహాలు పెట్టి హుస్సేన్ సాగర్‌లో బుద్ధ భగవానుడి విగ్రహాన్ని ప్రతిష్టించి ఎన్నో అందాలను అద్దారు. ఇప్పుడు అలాంటి ట్యాంక్ బండ్ ఏపీ‌లో కూడా రూపొందుతోంది. నిలువెత్తు ఎన్టీఆర్ విగ్రహం కొలువుతీరిన ఈ అద్భుత దృశ్యం ఉంది మెరెక్కడో కాదు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో. హుస్సేన్ సాగర్‌లో బుద్ధుడి విగ్రహాన్ని ఎన్టీఆర్ ప్రతిష్టిస్తే ఆయన విగ్రహాన్ని సత్తెనపల్లిలో ఏర్పాటు చేయిస్తోంది. ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా కోడెల తన సొంత నియోజకవర్గంలో అతి పెద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నారు.

56 ఎకరాల విస్తర్ణం గల సత్తెనపల్లిలోని ఈ చెరువు ఒకప్పుడు దర్గంధం వెదజల్లుతూ మురికి కూపంగా ఉండేది. అయితే స్పీకర్ కోడెల పట్టుపట్టి ఈ చెరువును సుందరంగా తీర్చిదిద్దారు. చెరువును నాగార్జున సాగర్ నీటిని నింపి చుట్టూ పచ్చని చెట్లు పెంచారు. అలాగే వర్షపు నీరు చెరువులో ఏడాది పొడవునా నిలిచేలా చర్యలు తీసుకున్నారు. చెరువు మధ్యలో 40 అడుగుల పీఠంపై 36 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ వర్థంతి రోజున అంటే ఈ నెల 18న సీఎం చంద్రబాబు అన్నగారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా హాజరువుతారు.

ఇక అన్నగారి విగ్రహం ప్రతిష్టించిన చెరువు చుట్టూ 65 ఎకరాలను టూరిజం స్పాట్ గా తీర్చిదిద్దుతున్నారు. చెరువు చుట్టూ రెండు కిలో మీటర్ల పొడవైన అతిపెద్ద వాకింగ్ ట్రాక్ నిర్మించడంతో పాటు పక్కనే 7 ఎకరాల స్థలంలో పార్కును కూడా నిర్మించారు. అలాగే అడ్వెంచర్ పార్క్ , హ్యాపీ ధియేటర్, యోగా సెంటర్, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహం దగ్గరకు బోటింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ పార్కుకు ఎన్టీఆర్ తారక రామా సాగర్ గా నామకరణం చేశారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలోనే ఈ పార్కు చుట్టూ జాతీయ నాయకుల విగ్రహాలు కూడా ఏర్పాటు చేస్తామని కోడెల చెప్పారు.సత్తెనపల్లి నియోజకవర్గం లో రికార్డు స్దాయిలో మరుగు దొడ్ల నిర్మాణం చేపట్టి ఆదర్శంగా నిలిచిన కోడెల శివప్రసాదరావు. ఇప్సుడు తారక రామ సాగర్ ‌తో మరోసారి అందరి దృష్టి ఆకర్షిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories