కోడుమూరులో కత్తులు దూస్తున్న వైసీపీ, టీడీపీ

కోడుమూరులో కత్తులు దూస్తున్న వైసీపీ, టీడీపీ
x
Highlights

కోట్ల కుటుంబం సొంత నియోజకవర్గం. ఉమ్మడి రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ప్రాతినిధ్యం వహించిన స్థానం. కాంగ్రెస్‌కు కంచుకోట. కానీ...

కోట్ల కుటుంబం సొంత నియోజకవర్గం. ఉమ్మడి రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ప్రాతినిధ్యం వహించిన స్థానం. కాంగ్రెస్‌కు కంచుకోట. కానీ ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయ్యింది. కాంగ్రెస్‌ పాతాళానికి పడిపోవడంతో, ఇప్పుడు టీడీపీ-వైసీపీ మధ్య హోరాహోరి సాగుతోందక్కడ. ఈ ఎన్నికల్లో ఎలాగైనా ఆ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి, రకరకాల అస్త్రాలను సంధిస్తున్నాయి.

కర్నూలు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ మెజార్టీ స్థానాలో విజయం సాధించింది. అందులో మరో కీలకమైన నియోజకవర్గం కోడుమూరు.

1962లో ఏర్పాటైన కోడుమూరు నియోజకవర్గంలో ఇప్పటికి కాంగ్రెస్, కాంగ్రెస్(ఐ)లు ఎనిమిది పర్యాయాలు, టీడీపి, వైసీపీలు చెరొకసారి, ఇండిపెండెంట్లు అభ్యర్థి ఒకసారి గెలుపొందారు. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య మొదటిసారి ఈ నియోజకవర్గం నుంచి గెలుపొంది, ఉమ్మడి రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ తరుపున శిఖామణి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, రికార్డు సృష్టించారు. ఆయన కూమారుడు మణిగాంధీ 2014 ఎన్నికలో వైసీపీ తరుపున పోటీ చేసి, కోట్ల కుటుంబానికి ఝలక్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

2009 లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనతో కోడుమూరు, గూడూరు, బెళగల్ మండలాలను, కర్నూలు మండలంలో ఉన్న 12 గ్రామాలు, కర్నూలు నియోజకవర్గంలోని 19 గ్రామాలు, నందికొట్కూరు నియోజకవర్గంలోని ఒక గ్రామాన్ని కలిపి కోడుమూరు నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు. కోట్ల కుటుంబ స్వస్థలం లద్దగిరి, కోడుమూరు మండలంలో ఉంది. ఈ నియోజకవర్గంలో కోట్ల కుటుంబానికి మంచి ప్రాబల్యం ఉండడంతో, కోట్ల కుటుంబం నిలబెట్టిన అభ్యర్థులకే ప్రజలు పట్టంకడుతూ వచ్చారు. అయితే రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ మూలకారణం కావడంతో నియోజకవర్గ ప్రజలు 2014 ఎన్నికల్లో కోట్ల కుటుంబానికి మద్దతు తెలుపకుండా జగన్ పార్టీ వైపు నిలిచారు.

ఎన్నో ఏళ్ళుగా కోట్ల నిలబెట్టిన అభ్యర్ధులను గెలుపిస్తూ వచ్చిన ప్రజలు, 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మణిగాంధీని బంపర్ మెజార్టీతో గెలిపించారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో జరిగిన రాజకీయ పరిణామాలతో, సిట్టింగ్ ఎమ్మెల్యే మణిగాంధీ, పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరడంతో, ఆయనపై నియోజకవర్గ ప్రజలు గుర్రుగా ఉన్నారు. నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డికి, మణిగాంధీకి మధ్య విభేదాలు ఏర్పడడంతో తెలుగు తమ్ముళ్లు రెండు గ్రూపులుగా ఏర్పడి నువ్వా, నేనా అనే రీతిలో విమర్శలకు దిగుతున్నారు. ఇదే అదనుగా చూసుకున్న వైసీపీ ఇంచార్జ్ మురళీకృష్ణ నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రచారం చేస్తున్నారు. విష్ణు, మణిగాంధీ తారాస్థాయి విభేధాల వల్ల పార్టీకి ఎక్కడ నష్టం వాటిల్లుతుందోనని టీడీపీ శ్రేణుల్లో గుబులు మొదలైంది.

సొంత నియోజకవర్గంలో కోట్లకు, ఆయన సోదరుడు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ఝలక్ ఇచ్చారు. కాంగ్రెస్ ఇంచార్జ్‌గా ఉన్నా, కోట్ల హర్షవర్ధన్ రెడ్డి తన అన్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరడంతో మనస్తాపానికి గురై వైసీపీలో చేరారు. ఈనెల 7న జగన్ సమక్షంలో దాదాపు 2 వేల మందితో కోట్ల హర్ష పార్టీలో చేరారు. కాంగ్రెస్‌కి చెందిన ఎంపీపీలతో పాటు, ఏడుగురు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు కూడా వైసీపీలో చేరారు. దీంతో కోట్ల కుటుంబంలో ఉన్న, మనస్పర్థలు బయటపడ్డాయి. ఇలా నేతల మధ్య విభేదాలతో, కోడుమూరు పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. తమ పట్టు నిలుపుకునేందుకు బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories