logo

హలో మీకు ఓటుందా... ప్లీజ్‌ చెక్‌ యువర్‌ ఓట్‌!!

హలో మీకు ఓటుందా... ప్లీజ్‌ చెక్‌ యువర్‌ ఓట్‌!!

ఎప్పుడో ఓటరుగా నమోదై ఉంటారు. మరి మీ ఓటు హక్కు అసలు ఉందా? ఏదైనా కారణాల వల్ల తొలగించారా..? మరి ఈ విషయం ఎలా తెలుస్తుంది..? ఓటును చెక్ చేసుకోవడం ఎలా..?

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా 90 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అయితే ఎప్పుడో ఓటరుగా నమోదై ఉన్నా తమ ఓటు ఉందా లేక ఏదైనా కారణాల వల్ల తొలగించారా వంటి విషయాల్లో ఓటర్లు తీవ్ర గందర గోళానికి గురవుతున్నారు. మరోవైపు ఏపీలో ఓట్లు అధికంగా తొలగించారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఓటు పై టెన్షన్ నెలకొంది.

అయితే ఓటు ఉందో, లేదో తెలుసుకునే పలు పద్ధతులను ఎన్నికల సంఘం తెలిపింది. టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1950 ఏర్పాటు చేసింది. ఈ టోల్‌ ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేసి మీ వివరాలను చెప్పటం ద్వారా మీ ఓటు ఉందో, లేదో తెలుసుకోవచ్చు. దీనితో పాటు 51969 నెంబర్‌కు ఏపీ అని టైప్‌ చేసి స్పేస్‌ ఇచ్చి ఓట్‌ అని టైప్‌ చేసి మళ్ళీ స్పేస్‌ ఇచ్చి ఓటరు ఐడీ కార్డు నెంబర్‌ను టైపు చేసి సెండ్‌ చేయాలి. ఓటరు జాబితాలో మీ పేరు ఉంటే, వెంటనే సమాచారం ఇస్తుంది.

ఇక నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ www.nvsp.in ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ కానీ నమోదు చేస్తే ఓటుందో లేదో తెలుస్తుంది ఒక వేళ ఓటు లేకపోతే అందులో నమోదు చేసుకోవచ్చు. ఎన్నికల సంఘం కల్పించిన వెబ్‌ పోర్టల్‌ www.ceoandhra(లేదా)telangana.nic.in ద్వారా ఓటు ఉందో, లేదో తెలుసుకోవచ్చు. సెర్చ్‌ యువర్‌ నేమ్‌ ఆప్షన్‌లోకి వెళ్ళి మీ పేరును, ఓటరు ఐడీ నెంబర్‌ ఎంటర్‌ చేస్తే వివరాలు వస్తాయి.

మొత్తానికి భారీ స్థాయిలో ఓట్లు తొలగించారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒకసారి ఓటును చెక్‌ చేసుకొని ఓటు తొలిగింపు జరిగి ఉంటే. తిరిగి నమోదు చేసుకునే అవకాశం నామినేషన్ల వరకు కలిపించారు.

లైవ్ టీవి

Share it
Top