logo

హెచ్ఎంటీవీ ఎక్స్‌క్లూజివ్‌.... కోడికత్తి నిందితుడి రిమాండ్‌ డ్రామా హైలెట్స్‌

హెచ్ఎంటీవీ ఎక్స్‌క్లూజివ్‌.... కోడికత్తి నిందితుడి రిమాండ్‌ డ్రామా హైలెట్స్‌
Highlights

విజయవాడ కోర్టు ఆవరణలో హైడ్రామా నడిచింది. జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావును విజయవాడ కోర్టుకు...

విజయవాడ కోర్టు ఆవరణలో హైడ్రామా నడిచింది. జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావును విజయవాడ కోర్టుకు తీసుకొచ్చిన పోలీసు అధికారులు తిరుగు ప్రయాణంలో తడబడ్డారు. నిందితుడికి కోర్టు ఫిబ్రవరి 8 వరకు రిమాండ్‌ విధించడంతో రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించే క్రమంలో పోలీసులు రిమాండ్‌ రిపోర్ట్‌ను పారేసుకున్నారు. రిమాండ్‌ రిపోర్ట్‌ లేకుండానే నిందితుడిని తీసుకొని రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు బయలుదేరారు. కోర్టు ఆవరణ దాటకముందే రిమాండ్‌ రిపోర్ట్‌ గుర్తు రావడంతో వాహనంతో పాటు నిందితుడు శ్రీనివాసరావును అక్కడే వదిలేసి పరుగులు పెట్టారు. కోర్టు ఆవరణ అంతా కలియదిరిగారు. దాదాపు 10 నుంచి 15 నిమిషాల పాటు రిమాండ్‌ రిపోర్ట్‌ కోసం కోర్టు ఆవరణలో వెతికారు.

రిమాండ్‌ రిపోర్ట్‌ కోసం వెదికే క్రమంలో పోలీసు అధికారులు నిందితుడు శ్రీనివాసరావును కారులోనే వదిలేశారు. సెక్యూరిటీ సిబ్బంది కూడా రిమాండ్‌ రిపోర్ట్‌ వెదకడానికి వెళ్లడంతో కారులో డ్రైవర్‌, నిందితుడు శ్రీనివాసరావు మాత్రమే ఉన్నారు. ఈ తతంగమంతా హెచ్ఎంటీవీ ఎక్స్‌క్లూజివ్‌గా కవర్‌ చేసింది.

శ్రీనివాసరావును ఒంటరిగా వదిలేసి వెళ్లిపోవడాన్ని హెచ్ఎంటీవీ చిత్రీకరింస్తుండటంతో కారు డ్రైవర్‌ అలర్ట్‌ అయ్యాడు. సెక్యూరి సిబ్బంది రాకుండానే శ్రీనివాసరావుతో పాటు కారును డ్రైవర్‌ కిలోమీటర్‌ వరకు తీసుకెళ్లాడు.

చివరకు రిమాండ్‌ రిపోర్ట్‌ను వెదికి పట్టుకున్న పోలీస్‌ అధికారులు కోర్టు ఆవరణలో కారు లేకపోవడంతో షాక్‌కు గురయ్యారు. నిందితుడు ఎటు వెళ్లిపోయాడోనని టెన్షన్‌ పడ్డారు. చివరకు విషయం తెలుసుకొని నిందితుడి కోసం పరుగు పెట్టారు. చివరకు కిలోమీటర్‌ తర్వాత ఆగివున్న కారును చూసి ఊపిరి పీల్చుకున్నారు.



లైవ్ టీవి


Share it
Top