భానుడి భ‌గ‌భ‌గ‌... తెలుగు రాష్ట్రాలు గ‌డ‌గ‌డ

భానుడి భ‌గ‌భ‌గ‌... తెలుగు రాష్ట్రాలు గ‌డ‌గ‌డ
x
Highlights

తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం దాకా భానుడు భగ్గుమంటున్నాడు. పలు జిల్లాల్లో 43 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు...

తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం దాకా భానుడు భగ్గుమంటున్నాడు. పలు జిల్లాల్లో 43 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. తీవ్ర వడగాడ్పులు వీస్తున్నాయి. రానున్న నాలుగు రోజులు ఇదే స్థాయి ఉష్ణోగ్రతలు వుండనున్నాయి. రోహిణి కార్తె శనివారం నుంచి ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరుగుతుంది. ఉమ్మడిఆదిలాబాద్‌ జిల్లాలో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉక్కబోత, వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

ఉత్తర, తూర్పు తెలంగాణలో 43 డిగ్రీల నుంచి 45 డిగ్రీలు పశ్చిమ, దక్షిణ తెలంగాణలో 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్‌లో రోడ్లన్నీ కర్ఫ్యూ మాదిరి నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇళ్ల నుంచి జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఎండల ధాటికి వన్యప్రాణులు తట్టుకోలేకపోతున్నాయి. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఉమ్మెడ శివారులో తాగు నీరు లేక నెమళ్లు సొమ్మసిల్లి పడిపోతున్నాయి. దాహార్తి తాళలేక నాలుగు నెమళ్లు మృతి చెందాయి.

రానున్న నాలుగురోజులు తెలంగాణలో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని దీంతో ఉష్ణోగ్రత 47 డిగ్రీలు, ఆపైన నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈనెల 28 వరకు వడగాల్పుల తీవ్రత మరీ ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఇటు ఆంద్రప్రదేశ్ లోనూ ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. మే 27 నుంచి జూన్ 2 వరకు ఎండల తీవ్రత అధికం కానుంది. రాయలసీమ, దక్షిణ కోస్తాతో పలు ప్రాంతాల్లో సగటున 5 నుంచి 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories