ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌
x
Highlights

రాష్ట్ర ప్రభుత్వం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు తెలంగాణ హైకోర్ట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై స్టే ఇవ్వలేమని న్యాయ...

రాష్ట్ర ప్రభుత్వం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు తెలంగాణ హైకోర్ట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై స్టే ఇవ్వలేమని న్యాయ స్థానం తెలిపింది. బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, రిజర్వేషన్ల ప్రాతిపదికన ఎన్నికలు జరగడం లేదని హైకోర్టులో పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఎస్సీ, ఎస్టీల కంటే బీసీలకే పంచాయితీ ఎన్నికల్లో తీవ్ర నష్టం జరుగుతుందని పిటిషనర్‌ తరపు న్యాయవాది రామచందర్‌ గౌడ్‌ పేర్కొన్నారు. అయితే బీసీలకు కేటాయించిన తర్వాతే ఎస్సీ, ఎస్టీలకు కేటాయించాలని పిటిషనర్‌ వాదనలు వినిపించారు.

ఈ పిటిషన్‌పై మరోసారి వాదనలు వింటామన్న కోర్టు, ఎలక్షన్ కమిషన్, పంచాయితీ రాజ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ, ఎన్నికల సంఘానికి , తెలంగాణ బీసీ కోఆపరేషన్, ఫైనాన్స్ కార్పొరేషన్లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే నెల 22కు వాయిదా వేసింది. అయితే పంచాయతీరాజ్‌ యాక్ట్‌ 285 సెక్షన్‌-ఏ గైడ్‌లైన్స్‌ ప్రకారం.. రిజర్వేషన్లు 50 శాతం లోపే ఉండాలని సూచించింది. ఎలక్షన్‌ కమిషన్‌, పంచాయితీరాజ్‌ ప్రిన్సిపాల్‌ సెక్రెటరీ, ఎన్నికల సంఘం, తెలంగాణ బీసీ కార్పోరేషన్‌, ఫైనాన్స్‌ కార్పోరేషన్‌‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.


Show Full Article
Print Article
Next Story
More Stories