తెలంగాణలో ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చెయ్యొద్దంటూ హైకోర్టు ఆదేశం

తెలంగాణలో ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చెయ్యొద్దంటూ హైకోర్టు ఆదేశం
x
Highlights

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరిన భూపతిరెడ్డి, యాదవరెడ్డిలపై అనర్హత వేటుతో ఏర్పడిన ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఈ నెల 15 వరకు...

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరిన భూపతిరెడ్డి, యాదవరెడ్డిలపై అనర్హత వేటుతో ఏర్పడిన ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఈ నెల 15 వరకు నోటిఫికేషన్ జారీ చేయొద్దని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారంటూ భూపతిరెడ్డి, యాదవరెడ్డితో పాటు రాములు నాయక్‌ల మండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌ అనర్హత వేటు వేయడాన్ని హైకోర్టులో సవాల్‌ చేశారు. భూపతి రెడ్డి, యాదవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఎమ్మెల్సీల సభ్యత్వం రద్దుకు సంబంధించిన రికార్డులను తమకు సమర్పించాలని శాసనమండలిని ఉన్నత న్యాయస్థానం సూచించింది. తదుపరి విచారణ ఈ నెల 15కు వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories