విభజన వివాదం ఎక్కడికి దారితీస్తుంది!!

హైకోర్టు విభజనపై రచ్చ కొనసాగుతోంది. కేంద్రం తీరును తప్పుబట్టిన చంద్రబాబు సంప్రదింపులు జరపకుండా ఎలా విభజిస్తారంటూ ప్రశ్నించారు. జగన్ కేసుల కోసమే హడావిడిగా హైకోర్టును విభజించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు హైకోర్టు విభజనపై సుప్రీంకు వెళ్లాలని ఏపీ న్యాయవాదుల సంఘం నిర్ణయించింది.
హైకోర్టు విభజనపై రచ్చ కొనసాగుతోంది. కేంద్రం తీరును తప్పుబట్టిన చంద్రబాబు సంప్రదింపులు జరపకుండా ఎలా విభజిస్తారంటూ ప్రశ్నించారు. జగన్ కేసుల కోసమే హడావిడిగా హైకోర్టును విభజించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు హైకోర్టు విభజనపై సుప్రీంకు వెళ్లాలని ఏపీ న్యాయవాదుల సంఘం నిర్ణయించింది. నేడు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తామని ప్రకటించింది. హైకోర్టు విభజనపై ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఏపీలో భవనం సిద్ధంకాకుండానే హైకోర్టును ఎలా విభజిస్తారంటూ మొన్న ఆందోళనకు దిగిన ఏపీ న్యాయవాదులు సుప్రీంను ఆశ్రయించాలని నిర్ణయించారు.
హైకోర్టు విభజనపై ఆంధ్రా లాయర్ల ఆందోళన ఇలాగుంటే, ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కేసులను దృష్టిలో పెట్టుకునే హైకోర్టు విభజన చేసినట్లు అనిపిస్తోందన్నారు. హైకోర్టు విభజనతో నాంపల్లి సీబీఐ కోర్టు విభజన కూడా జరుగుతుందన్నారు. జగన్ కేసులో వాదనలు జరగకపోయినా న్యాయ ప్రక్రియ ముగిసిందన్న బాబు హైకోర్టు విభజనతో నాంపల్లి కోర్టు జడ్జి కూడా బదిలీ అవుతారని, దాంతో ప్రక్రియ మొత్తం మళ్లీ మొదటికొస్తుందని అభిప్రాయపడ్డారు.
అయితే, హైకోర్టు విభజన విషయంలో చంద్రబాబు ప్లేటు మార్చారని బీజేపీ ఎంపీ జీవీఎల్ ఆరోపించారు. హైకోర్టు విభజనను కూడా రాజకీయం చేస్తారా? అంటూ మండిపడ్డారు. ఇదిలా ఉంటే, జనవరి ఒకటి నుంచే ఏపీలో హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి నెలాఖరుకు లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌కల్లా అమరావతిలో కోర్టు కాంప్లెక్స్‌ను సిద్ధం చేయాలనుకుంటోన్న ప్రభుత్వం ప్రారంభోత్సవానికి సుప్రీం చీఫ్ జస్టిస్‌ను ఆహ్వానించాలని భావిస్తోంది.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
LPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMTఉక్రెయిన్ కథ ముగిసిపోయిందంటున్న రష్యా.. పుతిన్ తర్వాతి టార్గెట్ ఆ...
27 May 2022 2:00 PM GMTKarimnagar: అక్రమ వడ్డీలకు యువకుడి బలి
27 May 2022 1:30 PM GMT'ఆది పురుష్' విషయంలో నిరాశ చెందిన ప్రభాస్ అభిమానులు
27 May 2022 1:00 PM GMT