ఇంటర్‌ బోర్డు వ్యవహారంపై హైకోర్టు సంచలన ఆదేశాలు..

ఇంటర్‌ బోర్డు వ్యవహారంపై హైకోర్టు సంచలన ఆదేశాలు..
x
Highlights

ఇంటర్‌ బోర్డ్‌ వ్యవహారంపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫలితాల్లో జరిగిన అవకతవకలపై సీరియస్‌ అయ్యింది. రీ వాల్యూయేషన్‌పై వాదనలను...

ఇంటర్‌ బోర్డ్‌ వ్యవహారంపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫలితాల్లో జరిగిన అవకతవకలపై సీరియస్‌ అయ్యింది. రీ వాల్యూయేషన్‌పై వాదనలను విన్న ధర్మాసనం పూర్తిస్థాయి సమాచారంతో నివేదికను సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. ఇంటర్‌ ఫలితాల్లో జరిగిన అక్రమాలు, ఆత్మహత్యలు చేసుకున్న మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, ఇందుకు కారణమైన అధికారులపై 304 A కింద చర్యలు తీసుకోవాలని ఎలాంటి ఫీజు చెల్లించకుండా రీ వాల్యూయేషన్‌కు అనుమతివ్వాలని.. బాలల హక్కుల సంఘం మంగళవారం హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఫలితాల్లో జరిగిన అక్రమాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా విద్యార్థులకు న్యాయం జరిగేందుకు ఎలాంటి చర్యలు తీసుకొంటారో చెప్పాలని ధర్మాసనం ఇంటర్ బోర్డును ప్రశ్నించింది. ఎన్ని రోజుల్లో విద్యార్థులకు న్యాయం చేస్తారో చెప్పాలని ఇంటర్ బోర్డును హైకోర్టు ప్రశ్నించింది. ఫెయిల్ అయిన మూడున్నర లక్షల మంది విద్యార్థుల పేపర్లను రివాల్యువేషన్ చేయగలరా అని కోర్టు బోర్డ్‌ను ప్రశ్నించింది. దీనికి సమాధానం చెబుతూ మూడున్నర లక్షల మంది పేపర్లు రీవాల్యువేషన్ చేయాలంటే రెండు నెలల సమయం పడుతుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి వివరించారు. ఈ సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం 9 లక్షల మంది పెపర్లు వాల్యువేషన్ చేయడానికి నెల రోజుల సమయం పడితే మూడున్నర లక్షల మంది పేపర్లు రీవాల్యువేషన్ చేయడానికి రెండు నెలల సమయం ఎందుకు పడుతుందని ప్రశ్నించింది. రీ వాల్యుయేషన్ కు ఎంత సమయం పడుతుందో సోమవారంలోగా నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతోనే తాము పిటిషన్‌ వేశామని బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు తెలిపారు. అయితే ఇంటర్‌ బోర్డు మాత్రం ఈ విషయంలో తప్పించుకునే ధోరణిలో వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇంటర్ పరీక్షల్లో లోపాలపై జ్యూడీషీయల్ విచారణకు హైకోర్టు ఒప్పుకోలేదు. విద్యార్థులకు ఎలాంటి న్యాయం చేస్తారో వివరిస్తూ నివేదిక ఇవ్వాలని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories