logo

సినీ నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు

సినీ నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు
Highlights

ప్రముఖ సినీ నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు వ్యతిరేకంగా చాలా కుట్రలు జరుగుతున్నాయని...

ప్రముఖ సినీ నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు వ్యతిరేకంగా చాలా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ నాలుగు రోజుల్లో కుట్రలు మరింత పెరిగాయని వ్యాఖ్యానించారు. ఏపీ సీఎస్‌ను మార్చడం కంటే దారుణం ఇంకేం ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ఇది కచ్చితంగా మోడీ కుట్రేనని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా మోడీ చేతిలో కీలుబొమ్మగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కుట్రలకు సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు శివాజీ. ఏపీలో మూడు బ్యాచులుగా ఏర్పడి జనం కొట్టుకుంటున్నారన్నారు. పవన్, జగన్, చంద్రబాబు బ్యాచ్‌లుగా విడిపోయి జనం చంపుకునేందుకు సిద్ధమవుతున్నారన్నారు. పవన్‌కల్యాణ్‌ నిష్కల్మషమైన వ్యక్తి అని కొనియాడారు. ఎక్కడ తప్పు జరిగినా ఖండించే వ్యక్తి పవనే అన్నారు. వైసీపీ అధినేత జగన్‌కు ప్రథమ శత్రువు ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డేనని చెప్పారు.


లైవ్ టీవి


Share it
Top