సంక్రాంతికి సిద్ధమవుతున్న పందెం కోళ్లు

సంక్రాంతికి సిద్ధమవుతున్న పందెం కోళ్లు
x
Highlights

యుద్ధానికి కోళ్లు సిద్ధమవుతున్నాయి కయ్యానికి కత్తి కట్టి కాలు దువ్వుతున్నాయి. కోతలు కోసిన పంట పొలాలు యుద్ధ భూమిగా మారనున్నాయి. కోట్లలో డబ్బు చేతులు మారే కాలం వచ్చేసింది సంక్రాంతి పండుగ వేల ఏపీలో కోడి పందేల హడావుడి మొదలైంది

యుద్ధానికి కోళ్లు సిద్ధమవుతున్నాయి కయ్యానికి కత్తి కట్టి కాలు దువ్వుతున్నాయి. కోతలు కోసిన పంట పొలాలు యుద్ధ భూమిగా మారనున్నాయి. కోట్లలో డబ్బు చేతులు మారే కాలం వచ్చేసింది సంక్రాంతి పండుగ వేల ఏపీలో కోడి పందేల హడావుడి మొదలైంది హైకోర్ట్ వద్దన్నా, పోలీసులు అడ్డుకుంటున్నా పందెం రాయుళ్లు మాత్రం తగ్గట్లేదు.సంక్రాంతి సంబరాలంటే పంట చేతికందడం, కొత్త అలుళ్లు ఇంటికి రావడం, ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బమ్మలు పెట్టడం ఆనందం, సంబరం మాత్రమే కాదు వీటన్నిటికీతోడు ఆమాటకొస్తే అంతకు మించి ఉభయ గోదావరి జిల్లాలో పందెం రాయుళ్లకు మాంచి కిక్కిచ్చేది కోళ్ల పందాలు. దీని కోసం నెల రోజుల ముందునుంచే ప్రక్రియ ప్రారంభమవుతుంది. పంట పొలాలు కోళ్ల పందాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతుంటాయి.

ఇక కోడిపందేల విషయంలో తొలిత పోలీసులు ఎన్ని అడ్డంకులు చెప్పినా తర్వాత సదా మామూలే అన్న స్ట్రాంగ్ ఫీలింగ అందరిలోనూ ఉంది. పందాలు తమ సంస్కృతి, సాంప్రదాం అంటూ నేతలు, ప్రజాప్రతినిధులు సైతం స్వయంగా భాగస్వాములై దగ్గరుండి పందాలు నిర్వమిస్తుండటం ఆనవాయితీ అయిపోయింది. అయితే ఈ సారి హైకోర్టు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోవడంతో. కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు. పోలీసులు హెచ్చరిక నేపథ్యంలో గోదావరి జిల్లాల్లో పందెం కోళ్ల పెంపకం దారులు తమ కోళ్లు అమ్ముడు పోతాయో లేవో అని ఆందోళన చెందుతున్నారు.

ప్రస్తుతం కోనసీమలో పలు ప్రాంతాల్లో కోడిపందేల నిర్వహణకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. ఇక ఎన్నికల సంవత్సరం కావడంతో పందాలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చర్చనీయాంసమైంది. మరోవైపు కోడిపందేలను సంస్కృతి సంప్రదాయండా ఆడుకోవచ్చుగానీ, అదొక జూదంగా ఆడటం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. సంప్రదాయ ముసుగులో కోడిపందేలను బెట్టింగులతో నిర్వహించకుండా అరికట్టాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories