నౌహీరా షేక్‌ అరెస్ట్‌.. కోర్టులో హాజరు

నౌహీరా షేక్‌ అరెస్ట్‌.. కోర్టులో హాజరు
x
Highlights

హీరా గ్రూపు కుంభకోణంలో డొంక కదులుతుందా? అధినేత్రి అరెస్ట్‌తో కోట్ల రూపాయల లెక్కలు తేలేనా? ఉగ్రవాదుల డిపాజిట్లు ఉన్నాయనే పోలీసుల అనుమానం నిజమేనా? ఇలాంటి ప్రశ్నలకు నౌహీరా షేక్ నోరు విప్పితే గానీ సమాధానాలు దొరకని పరిస్థితి.

హీరా గ్రూపు కుంభకోణంలో డొంక కదులుతుందా? అధినేత్రి అరెస్ట్‌తో కోట్ల రూపాయల లెక్కలు తేలేనా? ఉగ్రవాదుల డిపాజిట్లు ఉన్నాయనే పోలీసుల అనుమానం నిజమేనా? ఇలాంటి ప్రశ్నలకు నౌహీరా షేక్ నోరు విప్పితే గానీ సమాధానాలు దొరకని పరిస్థితి. చైన్ లింక్ వ్యాపారంలో కోట్లు కూడబెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ గ్రూప్ అధినేత్రి నౌహీరా షేక్‌ను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసి, చిత్తూరు కోర్టులో హాజరుపరిచారు.

గొలుసుకట్టు వ్యాపారం పేరుతో దేశవ్యాప్తంగా కోట్ల రూపాయలను డిపాజిట్లుగా సేకరించింది హీరా గ్రూప్. అయితే ఆ గ్రూప్ కు బాస్ గా వ్యవహరించిన నౌహీరా షేక్ కోట్ల రూపాయలు స్వాహా చేసినట్లు ఆరోపణలున్నాయి. హీరా గ్రూపులో ఉగ్రవాదుల డిపాజిట్లు సైతం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఆమెను అరెస్టు చేసిన పోలీసులు చిత్తూరు కోర్టులో హాజరుపరిచారు.

దేశవ్యాప్తంగా నౌహీరా మోసాలు ఉండటమే కాకుండా పలు బ్యాంకు ఖాతాలను కూడా నిర్వహించారని, విదేశాల్లో కూడా ఈమెకు బ్యాంకు ఖాతాలు ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో జాతీయ, అంతర్జాతీయ దర్యాప్తు సంస్థల సహకారాన్ని ఏపీ సీఐడీ కోరింది. 8 విదేశీ బ్యాంకుల్లో వందల కోట్ల రూపాయల లావాదేవీలను హీరా గ్రూప్ నిర్వహించినట్లు తేలింది. ఇప్పటి వరకు సీఐడీ దర్యాప్తులో హీరా గ్రూప్ స్కాం విలువ 8 వేల కోట్ల రూపాయలు ఉంటుందనే అంచనాకు వచ్చారు.

మరోవైపు హీరా గ్రూప్ ఫెమా నిబంధనలు కూడా ఉల్లంఘించి నిధులను అక్రమంగా ఉపయోగించినట్లు సీసీఎస్ పోలీసులు చెబుతున్నారు. ఇన్ని వేల కోట్ల రూపాయల స్కాం వెనుక రాజకీయ నాయకులు హస్తం కూడా ఉండే అవకాశం లేకపోలేదని అందుకే మరింత లోతైన దర్యాప్తు కోసం నౌహీరా కస్టడీని పోలీసులు కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, నౌహీరా మాత్రం ఇదంతా వాంటెడ్ గానే జరిగిందని చెప్పారు. స్కాంకి, బిజినెస్‌కి తేడా తెలియని వారే తనపై ఆరోపణలు చేస్తున్నారని, తాను కోర్టులో రుజువు చేస్తానని చెబుతున్నారు. మరి హీరా గ్రూప్ అధినేత్రి చెబుతున్న దాంట్లో వాస్తమెంత? పోలీసులు ఆరోపణలు నిజమేనా అన్నది విచారణలో తేలాల్చి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories