హీరా గోల్డ్ కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన ఈడీ

హీరా గోల్డ్ కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన ఈడీ
x
Highlights

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హీరా గోల్డ్ కేసు దర్యాప్తును ఈడీ అధికారులు ముమ్మరం చేశారు. 50వేల కోట్ల రూపాయలు మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు...

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హీరా గోల్డ్ కేసు దర్యాప్తును ఈడీ అధికారులు ముమ్మరం చేశారు. 50వేల కోట్ల రూపాయలు మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు అనుమానిస్తున్న అధికారులు.. నౌహిరాతో పాటు బిజూథామస్, మౌళి థామస్‌ను కస్టడికి ఇవ్వాలంటూ నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ వేశారు. దీంతో కోర్టు 7 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది. అధిక వడ్డీ ఆశచూపి పెద్దమొత్తంలో డిపాజిట్లు వసూలు చేసి హీరాగ్రూప్‌ మోసాలకు పాల్పడినట్లు హైదరాబాద్, ముంబై, తిరుపతి, బెంగుళూర్‌తో పాటు పలు రాష్ట్రాల్లో చీటింగ్ కేసులు నమోదయ్యాయి. చంచల్‌గూడ జైలులో వున్న నౌహీరా షేక్ తోపాటు బిజూథామ్, మౌళి థామస్‌లను ఏడు రోజుల పాటు ఈడీ అధికారులు కస్టడిలోకి తీసుకొని విచారించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories