పంతంగి వద్ద పోటెత్తిన వాహనాలు

పంతంగి వద్ద పోటెత్తిన వాహనాలు
x
Highlights

ఓటువేయడానికి హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు బయలుదేరిన ప్రయాణికుల వాహనాలతో రహదారులు కిక్కిరిసిపోయాయి. మరోవైపు రైళ్లు అన్నీ నిండిపోయాయి. టిక్కెట్ బుక్...

ఓటువేయడానికి హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు బయలుదేరిన ప్రయాణికుల వాహనాలతో రహదారులు కిక్కిరిసిపోయాయి. మరోవైపు రైళ్లు అన్నీ నిండిపోయాయి. టిక్కెట్ బుక్ చేద్దామంటే వెయిటింగ్ లిస్ట్ కూడా లేదు. నిన్న సాయంత్రం నుంచే ఏపీవాసులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. అయితే, ఈ వాహనాలతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరాయి. ఇవాళ ఉదయం హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర ట్రాఫిక్ జామ్‌ అయ్యింది. దీంతో టోల్ ప్లాజా వద్ద కనుచూపు మేరలో వాహనాలు నిలిచిపోయాయి. రహదారులు ఎక్కడ చూసినా వాహనాలతో బారులుతీరి దర్శనిమిస్తున్నాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద రద్దీ ఎక్కువగా ఉండటంతో తొమ్మిది కౌంటర్లను తెరిచినా వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయంలో టోల్ ఫీజు వసూలు నిలిపివేయాలని టోల్ ప్లాజా నిర్వాహకులతో ప్రయాణీకులు వాగ్వాదానికి దిగారు.

ఈ సందర్భంగా కొందరు టోల్ ప్లాజ్ గేట్లపై దాడిచేసి, ధ్వంసం చేశారు. గంటల కొద్దీ వేచి ఉండటంతో సహనం కోల్పోయిన ప్రయాణికులు ఒక్కసారిగా గేట్లను ధ్వంసం చేయడంతో, సిబ్బంది వారిని అడ్డుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్లాజా వద్ద అన్ని గేట్లూ ధ్వంసం కావడంతో ప్రస్తుతం వాహనాల క్లియరెన్స్ సాగుతోంది. దీని గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ప్రయాణికులకు నచ్చజెబుతున్నారు. అన్ని వాహనాలనూ పంపించిన తరువాత గేట్లను పునరుద్ధరిస్తామని వారు వెల్లడించారు.




Show Full Article
Print Article
Next Story
More Stories