Top
logo

మంచు దుప్పటి కప్పుకున్న కాశ్మీర్

Snowfall
X
Snowfall
Highlights

కాశ్మీర్ లోయకు కొత్త అందాలు వచ్చాయి. మంచు దుప్పటి కప్పుకొని రోడ్లన్నీ శ్వేతవర్ణాన్ని అద్దుకున్నాయి. కాశ్మీర్ లోయలోని ఏ ప్రాంతం చూసినా హిమపాతమే కనిపిస్తోంది. శ్రీనగర్, రాజౌరి, సోన్‌మార్గ్, బందీపురాతో పాటూ చాలా ప్రాంతాల్లో రోడ్లపై మంచు పేరుకుపోయింది.

కాశ్మీర్ లోయకు కొత్త అందాలు వచ్చాయి. మంచు దుప్పటి కప్పుకొని రోడ్లన్నీ శ్వేతవర్ణాన్ని అద్దుకున్నాయి. కాశ్మీర్ లోయలోని ఏ ప్రాంతం చూసినా హిమపాతమే కనిపిస్తోంది. శ్రీనగర్, రాజౌరి, సోన్‌మార్గ్, బందీపురాతో పాటూ చాలా ప్రాంతాల్లో రోడ్లపై మంచు పేరుకుపోయింది.

జమ్మూకాశ్మీర్‌లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో అక్కడ వాతావరణం పూర్తిగా మారిపోయింది. కాశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో గ్యాప్ లేకుండా మంచు వర్షం కురుస్తోంది. ఇళ్లు, చెట్లు, రోడ్లు, పర్యావరణం అంతా శ్వేతవర్ణంగా మారిపోయింది. ఈ శీతాకాలంలో ఇదే ఫస్ట్ స్నో ఫాల్. మంచు వర్షానికి ప్రజలు గొడుగులు వేసుకుని తిరుగుతున్నారు. మంచు కురుస్తుండటంతో కాశ్మీర్‌ లోయకు పర్యాటకుల తాకిడి పెరిగింది. భూతల స్వర్గంగా భావిచే కాశ్మీర్ లోయ అందాలు చూసేందుకు పర్యాటకులు క్యూకడుతున్నారు. మంచు ముద్దలతో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. టూరిస్టుల తాకిడితో వ్యాలీలో సందడి వాతావరణం కనిపిస్తోంది.

జమ్మూకాశ్మీర్ మంచు పరదా కప్పుకుంది. కాశ్మీర్ లోయలో డిసెంబర్ మాసమంతా పొడిగా ఉన్న వాతావరణం ఇప్పుడు ఒక్కసారిగా మారిపోయింది. మంచు ప్రభావానికి కాశ్మీర్ లోయతో పాటు సమీప ప్రాంతాల రూపురేఖలే మారిపోయాయి. ఎక్కడ చూసిన తెల్లటి మంచు ముద్దలే కనిపిస్తున్నాయి. కాశ్మీర్ లో అత్యధిక ప్రాంతం గజగజలాడుతోంది. గుల్‌మార్గ్, పహల్‌గావ్ పర్యాటక రిసార్ట్‌లు మంచుతో నిండిపోయాయి. శ్రీనగర్‌లో తెల్లవారుజామున దారి కనిపించలేదు. పలుప్రాంతాలను మంచు కప్పేసింది. మరోవైపు ఉష్ణోగ్రతలు కనిష్ఠస్థాయికి పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కాశ్మీర్‌ను మంచు, చలిగాలులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. రెండు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన దాల్ సరస్సుతో పాటూ మిగిలిన సరస్సులు గడ్డ కట్టుకుపోయాయి. లోయలో ఏ ప్రాంతం చూసినా హిమపాతమే కనిపిస్తోంది. చాలా ప్రాంతాల్లో రోడ్లపై మంచు పేరుకుపోయింది. కశ్మీర్‌లో కురుస్తున్న మంచు.. పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. రోడ్లు, చెట్లపై పేరుకుపోయిన మంచు పర్యాటకుల్లో ఆనందం నింపుతోంది. ఈ సీజన్‌లో కురుస్తున్న మంచు మరింత మంది పర్యాటకులను ఆకర్షిస్తుందని స్థానికులు చెబుతున్నారు.

Next Story