తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్న వరదలు

తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్న వరదలు
x
Highlights

తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు.. వరదలు అంతలాకుతలం చేస్తున్నాయి. వారం రోజుల నుంచి పొంగుతోన్న గోదావరి గడగడ లాడిస్తోంటే.. క్రమక్రమంగా పెరుగుతోన్న...

తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు.. వరదలు అంతలాకుతలం చేస్తున్నాయి. వారం రోజుల నుంచి పొంగుతోన్న గోదావరి గడగడ లాడిస్తోంటే.. క్రమక్రమంగా పెరుగుతోన్న కృష్ణమ్మ కష్టాలు తెస్తోంది. వీటికి తోడు ఉత్తరాంధ్రాలో వంశధార వణికిస్తోంది. భారీ వర్షాలకు ఏపీ, తెలంగాణలో ప్రధాన నదులతో పాటు వాగులు వంకలు పొంగుతున్నాయి. గోదావరి తగ్గినట్టే తగ్గి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. పోలవరం కాపర్ డ్యామ్ దగ్గర చిక్కుకున్న మత్య్సకారులను నేవీ హెలికాప్టర్ ద్వారా రక్షించారు. అయితే తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలంలో ఇద్దరు యువకులు వరద ప్రవాహంలో గల్లంతయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ఏజెన్సీ గిరిజన గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. లంక గ్రామాలకు వెళ్లే కాజ్‌ వేలపై వరద నీరు చేరడంతో రాకపోకలు స్తంభించిపోయాయి.

అటు ఉత్తరాంధ్రలో సైతం వరదలు ముంచెత్తుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో వంశధార నది ఉగ్రరూపం దాల్చింది. గార మండలంలోని కలింగపట్నం తీరం వద్ద వంశధార నది సముద్రంలో కలిసే ప్రాంతం భారీగా కోతకు గురైంది. పర్యాటకులను ఆకర్షించేందుకు ఏర్పాటు చేసిన విగ్రహాలు ప్రవాహాంలో కొట్టుకుపోయాయి. తెలంగాణలో భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మంగపేట మండలం మొట్లగూడెం సమీపంలో మల్లూరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. వరద పోటెత్తడంతో అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇటు కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. నారాయణ పూర్ నుంచి జూరాలకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. కృష్ణ, బీమా నది కలిసే చోట వరద ఉధృతి ఎక్కువ కావడంతో వందల ఎకరాల వరి నీటమునిగింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories