Top
logo

ఢిల్లీలో రాత్రి నుంచి వర్షం...తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, ఉద్యోగులు

ఢిల్లీలో రాత్రి నుంచి వర్షం...తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, ఉద్యోగులు
Highlights

దేశ రాజధాని ఢిల్లీ వణికిపోతోంది. ఒవైపు చలి మరోవైపు నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి ఢిల్లీవాసులు...

దేశ రాజధాని ఢిల్లీ వణికిపోతోంది. ఒవైపు చలి మరోవైపు నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి ఢిల్లీవాసులు వణికిపోతున్నారు. ఈ ఉదయం నుంచి ఢిల్లీ, గురుగ్రామ్‌ ప్రాంతాల్లో వడగండ్ల వాన కురుస్తోంది. భారీ వర్షం కారణంగా ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నల్లటి మేఘాలు కమ్ముకోవడంతో ఢిల్లీ అంతటా చీకటిమయమైంది. ఉదయం 9 గంటల సమయంలోనూ అర్ధరాత్రిని తలపించింది. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా కన్పించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.

పంజాబ్‌, చండీగఢ్‌, ఉత్తరాఖండ్‌లోనూ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అటు హిమాచల్‌ ప్రదేశ్‌లో సిమ్లా సహా కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన మంచు కురుస్తోంది. వాహనాలు, రోడ్లపై మంచు దట్టంగా పరుచుకుంది.

Next Story


లైవ్ టీవి