Top
logo

కూల్ డ్రింక్స్ వెస్ట్ .. కొబ్బరినీళ్ళే బెస్ట్ ..

కూల్ డ్రింక్స్ వెస్ట్ .. కొబ్బరినీళ్ళే బెస్ట్ ..
X
Highlights

వేసవి కాలంలో మనం ఎక్కువగా కూల్ డ్రింక్స్ ని ఇష్ట పడతాం కానీ వీటికంటే కొబ్బరినీళ్ళు ఎంతో బెటర్ అంటున్నారు...

వేసవి కాలంలో మనం ఎక్కువగా కూల్ డ్రింక్స్ ని ఇష్ట పడతాం కానీ వీటికంటే కొబ్బరినీళ్ళు ఎంతో బెటర్ అంటున్నారు వైద్యులు .కొబ్బరి నీరు తాగడం వల్ల గుండెకు మేలు చేయడం మాత్రమే కాకుండా, శరీర ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచుతుంది. వేడిని, దాహాన్ని తగ్గించే కొబ్బరి బొండాంలో సహజ ఖనిజాలు అధికంగా ఉన్నాయి. ఈ ఖనిజాలతో పాటు కొలెస్ట్రాల్‌ ఉండకపోవడం ద్వారా గుండెకు ఎంతో మేలు చేస్తుంది. ప్రకృతి మనకు ప్రసాదించిన కొబ్బరి నీరు త్రాగడం వల్ల అనేక లాభాలు కూడా ఉన్నాయి.

ఒక కొబ్బరి బోండాంలోని నీరు ఒక సెలైన్‌ వాటర్‌ బాటిల్‌తో సమానమని వైద్యులు చెపుతున్నారు.అలాంటి కొబ్బరి నీటిలో 24 కేలరీల శక్తి ఉంటుంది. ముఖ్యంగా లేత కొబ్బరి బోండాల్లో 90 నుంచి 95 శాతం నీరు ఉంటుందని, వేసవి కాలంలో ఈ నీటిని తాగడం ఎంతో శ్రేయస్కరమని వైద్యులు సలహా ఇస్తున్నారు. వేసవిలో కళ్లు మంట, వడదెబ్బ వంటివి రాకుండా వుండాలంటే కొబ్బరి నీళ్లు తాగడమే మంచిదని అభిప్రాయపడుతున్నారు ..

Next Story