వేసవిలో చెరుకు రసం తాగితే ఎంత మంచిదో తెలుసా?

వేసవిలో చెరుకు రసం తాగితే ఎంత మంచిదో తెలుసా?
x
Highlights

అసలే ఎండాకాలం పిల్లలను, పెద్దలను నోరూరించే, తియ్యని రసం చెరకు రసం. దీనిని ఇష్టపడని వాళ్లు ఉండరు. ఇది శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపటంలో ప్రముఖపాత్ర...

అసలే ఎండాకాలం పిల్లలను, పెద్దలను నోరూరించే, తియ్యని రసం చెరకు రసం. దీనిని ఇష్టపడని వాళ్లు ఉండరు. ఇది శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపటంలో ప్రముఖపాత్ర వహిస్తుంది. ఈ చెరకు రసంలో ఆరోగ్యానికి ఉపయోగపడే మినరల్స్, విటమిన్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఇది బరువును అదుపులో ఉంచుతుంది. చెరుకురసంలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం.

1. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఈ జ్యూస్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు అని మనం భావిస్తాము. కానీ, ఇటువంటప్పుడు ఒక గ్లాస్ చెరుకురసం తాగడం వల్ల ఈ జబ్బులను నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు. వేసవిలో ప్రతిరోజు ఒక గ్లాసు చెరకురసం త్రాగటం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది.

2. క్రోమియం, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు ఇందులో ఎక్కువుగా ఉంటాయి. అంతేకాకుండా ఐరన్, ఫోలిక్ యాసిడ్‌లు ఎక్కువుగా ఉన్నచెరకు రసం బాలింతలు తీసుకోవటం వలన మంచి ఫలితం ఉంటుంది.

3. చెరకులో కాల్షియం ఉండటంతో అది ఎముకలు దంతాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చిన్నపిల్లల ఎదుగుదలకు చెరకురసం చక్కగా దోహదపడుతుంది.

4. శరీరంలో అధిక బరువు పెరగడానికి కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ను ఈ రసం తగ్గించగలదు. బరువు తగ్గాలనుకునే వారికి చెరకురసం దివ్యౌషధంలా పనిచేస్తుంది.

5. ఒక గ్లాసు చెరకు రసంలో అరచెక్క నిమ్మరసాన్ని కలిపి ప్రతి రోజూ రెండు పూటలా తీసుకోవటం వల్ల కాలేయ పనితీరు మెరుగుపడి కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.

6. ఈ చెరకు రసం పిల్లల్లో తరచూ వచ్చే చిన్నచిన్న అనారోగ్యాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. తీవ్ర జ్వరం, మాంసకృత్తులు లోపించడం వంటి సమస్యల నుంచి పిల్లలను ఈ రసం కాపాడుతుంది.

7. మూత్రపిండాలలో ఉన్న రాళ్ల సమస్యల్ని తొలగించడంలో చెరుకురసం ఎంతగానో దోహదపడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories