Top
logo

చంద్రబాబు కోసం ఏపీలో మాజీ ప్రధాని ప్రచారం..

చంద్రబాబు కోసం ఏపీలో మాజీ ప్రధాని ప్రచారం..
X
Highlights

సెక్యులర్ పార్టీల గెలుపు కోసం ప్రచారానికి ఎక్కడికైనా తాను వెళ్తానని దేవెగౌడ తెలిపారు. ఏపీ టీడీపీ అధినేత నారా...

సెక్యులర్ పార్టీల గెలుపు కోసం ప్రచారానికి ఎక్కడికైనా తాను వెళ్తానని దేవెగౌడ తెలిపారు. ఏపీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు తనను ఆహ్వానించారని, తప్పనిసరిగా ఏపీలో ఎన్నికల ప్రచారానికి వెళ్తానని చెప్పారు. కాంగ్రెస్-జేడీఎస్ కూటమి తరఫున రాష్ట్రంలోని అన్నిచోట్లా తాను ఎన్నికల ప్రచారం చేస్తానని చెప్పారు. దీనిలో భాగంగానే చంద్రబాబు నాయుడు తరఫునుండి ఎన్నికల ప్రచారంలో పాల్గోంటానని దేవెగౌడ స్పష్టం చేశారు. మాజీ ప్రధాని, ఎక్కడ నా అవసరం ఉందో అక్కడకు తప్పనిసరిగా వెళ్లి ప్రచారం చేస్తాను' అని దేవెగౌడ ప్రకటించారు. కాగా దేవెగౌడ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. కర్ణాటకలోని తుంకూరు లోక్‌సభ నియోజకవర్గానికి సోమవారంనాడు దేవెగౌడ నామినేషన్ వేశారు.

Next Story