ప్రాణాన్ని రిస్క్ చేసింది..తండ్రికే పునర్జన్మనిచ్చింది

ప్రాణాన్ని రిస్క్ చేసింది..తండ్రికే పునర్జన్మనిచ్చింది
x
Highlights

కంటే కూతుర్నే కనాలనేది పెద్దల మాట. ఎందుకు తమ తల్లిదండ్రుల కష్టాలను తనవిగా భావించి వారికి నిరంతరం చెదోడువాదోడుగా నిలుస్తుంది కాబట్టి. అయితే నేటి...

కంటే కూతుర్నే కనాలనేది పెద్దల మాట. ఎందుకు తమ తల్లిదండ్రుల కష్టాలను తనవిగా భావించి వారికి నిరంతరం చెదోడువాదోడుగా నిలుస్తుంది కాబట్టి. అయితే నేటి సమాజంలో మాత్రం చాలా మంది దంపతులు తమ కుటుంబ వారసుడి కోసమే తెగ తపత్రయపడుతుంటారు. ఇక ఆడపిల్ల విషయానికి వొస్తే మాత్రం వారినో భారంగా, ఎందుకు పుట్టిందనే ధీనంగా వ్యవహరిస్తుంటారు. అయితే కంటే కూతుర్నే కనాలనేది మరోక్కసారి రూజువైంది. కొడుకే వారసుడిగా ఫీల్ అయ్యేవారికి ఇదో కనువిప్పు. అయితే ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్‌ గోయాంక కూతుళ్ల గొప్పతనాన్ని తెలియజేస్తూ ఓ ట్వీట్ ను పెట్టాడు దీంతో ఇప్పడు ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

ఇక వివరాల్లోకి వెళితే కోల్‌కతాకు చెందిన రాఖీ దత్తా(19) తండ్రి కొంతకాలంగా కాలేయ సమస్యతో అల్లాడుతున్నారు. కాలేయ మార్పిడి చేయకపోతే ఆయన ఇక బతకలేరని అని వైద్యులు స్ఫష్టం చేశారు. తండ్రి ప్రాణాలను నిలబెట్టడం కోసం తన ప్రాణాన్నే రిస్క్‌‌లో పెట్టుకుంది. కాగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న తన కన్న తండ్రి కోసం తన లివర్‌లో 65 శాతాన్ని దానం చేసింది. కాగా తనకు భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యల గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా, సర్జరీల వల్ల కలిగే నొప్పి, కత్తి గాట్లు ఇవేవి ఆమె పట్టించుకోలేదని కేవలం తన తండ్రి ఆరోగ్యాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుందని హర్ష్ గోయాంక ట్విట్టర్‌లో తెలిపారు. ఇక చివరగా ఆడపిల్లలనూ చిన్న చూపు చూసే తల్లిదండ్రులకు, కూతుళ్లు ఎందుకు పనికిరారు అనే మనస్తత్వంతో ఇదే కరెక్ట్‌ సమాధానం అంటూ హర్ష్‌ గోయాంక ట్వీట్‌ చేశారు. ఇక దీంతో రాఖీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు నెటిజన్లు.

Show Full Article
Print Article
Next Story
More Stories