Top
logo

మంత్రివర్గ తొలి జాబితాలో పేరు లేకపోవడంపై హరీష్ రావు స్పందన

మంత్రివర్గ తొలి జాబితాలో పేరు లేకపోవడంపై హరీష్ రావు స్పందన
X
Highlights

మంత్రివర్గంలో తనకు స్థానం దక్కలేదన్న అసంతృప్తి తనకు లేదన్నారు హరీశ్‌రావు. తన పేరిట సేనలు కానీ తనకు గ్రూపులు...

మంత్రివర్గంలో తనకు స్థానం దక్కలేదన్న అసంతృప్తి తనకు లేదన్నారు హరీశ్‌రావు. తన పేరిట సేనలు కానీ తనకు గ్రూపులు కాని లేవని ఆయన స్పష్టం చేశారు. అన్ని వర్గాల సమీకరణలను దృష్టిలో పెట్టుకొనే సీఎం కేసీఆర్‌ కేబినెట్‌ను విస్తరించారన్నారు. సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు. టీఆర్ఎస్‌లో తాను క్రమశిక్షణగల కార్యకర్తనంటూ మరోసారి చెప్పిన హరీశ్‌రావు కేసీఆర్‌ ఏది ఆదేశిస్తే దాన్నే ఆచరిస్తానంటూ కుండబద్దలు కొట్టారు.


Next Story