logo

అందుకే భువనగిరిలో ఓడిపోయాం : హరీశ్‌ రావు

అందుకే భువనగిరిలో ఓడిపోయాం : హరీశ్‌ రావు
Highlights

ప్రజాసేవలో ప్రజాప్రతినిధులకు విరామం ఉండదని అన్నారు ఎమ్మెల్యే హరీశ్ రావు. రెండోసారి మెదక్ పార్లమెంటు సభ్యుడిగా...

ప్రజాసేవలో ప్రజాప్రతినిధులకు విరామం ఉండదని అన్నారు ఎమ్మెల్యే హరీశ్ రావు. రెండోసారి మెదక్ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన కొత్త ప్రభాకర్ రెడ్డికి సంగారెడ్డి పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 9 స్థానాలల్లో గెలుపొందడం సాధారణ విషయం కాదన్నారు హరీశ్ రావు. భువనగిరి స్థానంలో టీఆర్ఎస్ పార్టీ గెలిచి ఓడినట్టు అయింది..తక్కువ ఓట్లతో రోడ్ రోలర్ ఓట్లు వల్ల ఓడిపోయామని హరీశ్ రావు చెప్పారు.


లైవ్ టీవి


Share it
Top