Top
logo

టీఆర్ఎస్‌లోకి సునీతా లక్ష్మారెడ్డి!: హరీష్ రావు

టీఆర్ఎస్‌లోకి సునీతా లక్ష్మారెడ్డి!: హరీష్ రావు
X
Highlights

తెలంగాణలో కాంగ్రెస్‌కు వరుస పెట్టి షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఆ పార్టీ సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా...

తెలంగాణలో కాంగ్రెస్‌కు వరుస పెట్టి షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఆ పార్టీ సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజుకో నేత కాంగ్రెస్‌పై నమ్మకం కోల్పోతున్నారని, సీఎం కేసీఆర్ పై నమ్మకంతో టీఆర్ఎస్‌లో చేరుతున్నారని అన్నారు. తాజాగా మాజీ మంత్రి, సీనియర్ నేత సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరబోతున్నారని హరీష్ రావు చెప్పుకొచ్చారు. మెదక్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా కందిలో హరీష్ రావు రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ వేసేందుకు వెళితే అసలు జనమే లేరని ఎద్దేవా చేశారు. కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే మెదక్ అభివృద్ధి సాధ్యమన్నారు.

Next Story