ఘుమఘుమలాడే బడ్జెట్‌ హల్వా రెడీ..!

ఘుమఘుమలాడే బడ్జెట్‌ హల్వా రెడీ..!
x
Highlights

బడ్జెట్‌ 2019 కార్యక్రమాలు లాంఛనంగా మొదలయ్యాయి. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ ప్రతాప్‌ శుక్లా ఆర్థికశాఖ కార్యాలయంలో హల్వా వేడుక ప్రారంభించారు.

బడ్జెట్‌ 2019 కార్యక్రమాలు లాంఛనంగా మొదలయ్యాయి. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ ప్రతాప్‌ శుక్లా ఆర్థికశాఖ కార్యాలయంలో హల్వా వేడుక ప్రారంభించారు. దీంతో నేటి నుంచే మధ్యంతర బడ్జెట్‌ కాగితాల ముద్రిస్తారు. బడ్జెట్ హల్వా వేడుకలో రవాణ శాఖ మంత్రి పొన్‌ రాధకృష్ణన్‌, ఆర్థిక శాఖ కార్యదర్శి డీఈఏ సుభాష్‌ గార్గ్‌ తదితరులు పాల్గొన్నారు.

బడ్జెట్ కాగితాల ముద్రణ ప్రారంభానికి ముందు భారతీయ వంటకమైన హల్వాను రెడీ చేస్తారు. ఆర్థిక మంత్రి సమక్షంలో దీనిని సిబ్బందికి పంచుతారు. కానీ ఈసారి ఆర్థిక మంత్రి వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లడంతో ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివప్రతాప్‌ పాల్గొన్నారు. జైట్లీ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు అమెరికా నుంచి వస్తారని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం. ఫిబ్రవరి 1వ తేదీన ఆయనే మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories