బీభత్సం సృష్టించిన వడగళ్ల వాన

బీభత్సం సృష్టించిన వడగళ్ల వాన
x
Highlights

మండే ఎండలు ఒకవైపు అకాల వర్షాలు మరోవైపుతో తెలంగాణ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వర్షం కురిసింది....

మండే ఎండలు ఒకవైపు అకాల వర్షాలు మరోవైపుతో తెలంగాణ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వర్షం కురిసింది. హైదరాబాద్‌తోపాటు సిద్దిపేట, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఇవాళ కూడా వర్షం కురిసింది. మెదక్‌, ఆదిలాబాద్ జిల్లాల్లో వడగళ్ల వాన కురవగా కరీంనగర్ జిల్లాలో ఉరుములతో కూడిన వర్షం పడింది. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా వరుసగా మూడోరోజు కూడా గాలివాన, వడగళ్లు పడడంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇప్పటికే గురువారం రాత్రి గంట పాటు కురిసిన భారీ వర్షానికి పలుచోట్ల వరి, మామిడి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మరో రెండు, మూడు రోజులు వర్షాలు పడతాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వడగండ్ల వానతో పంటనష్టం సంభవించి నష్టపోయిన బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories