ఇక పాఠశాలల్లో జైహింద్‌, జై భారత్‌ అనాల్సిందే...

schools
x
schools
Highlights

గుజరాత్ పాఠశాలల్లో హాజరుకు సంబందించి విద్యార్థులు స్పందించాల్సిన విధానంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి.

గుజరాత్ పాఠశాలల్లో హాజరుకు సంబందించి విద్యార్థులు స్పందించాల్సిన విధానంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇక పాఠశాల విద్యార్థులు అడెంటెన్స్ సమయంలో జైహింద్, జై భారత్ అని చెప్పాల్సిందే అంటూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని కొందరు స్వాగతించిన, మరికొందరు విమర్శిస్తున్నారు.

స్కూల్స్ లో టీచర్లు విద్యార్థుల పేర్లు పిలుస్తూ అటెండెన్స్‌ తీసుకునే సమయంలో సాధారణంగా ఎస్‌ సార్‌ అనో, ప్రెజెంట్‌ సార్‌ అనో సమాధానం ఇస్తుంటారు. అయితే, దీనికి భిన్నంగా గుజరాత్‌ ప్రభుత్వం కొత్త ఒరవడి సృష్టించడానికి శ్రీకారం చుట్టింది. గుజరాత్‌లోని స్కూళ్లలో ఇక నుంచి అటెండెన్స్‌ తీసుకునే సమయంలో విద్యార్థులు జైభారత్‌ అని లేదా జైహింద్‌ అని చెప్పాల్సి ఉంటుంది. కొత్త సంవత్సరం సందర్భంగా గుజరాత్ విద్యాశాఖ మంత్రి భూపేంద్ర సిన్హ్ చూడాసమా సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కొనసాగుతున్న పాఠశాలల్లో విద్యార్థులు హాజరు పిలిచేటపుడు ఎస్ సర్, ప్రజెంట్ సార్ కు బదులు జై హింద్, లేదా జై భారత్ అంటూ పలకాలని గుజరాత్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నోటిఫికేషన్ ను డైరెక్టరేట్ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అండ్ గుజరాత్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ జారీ చేసింది. యస్ సార్ అని సమాధానం ఇవ్వడానికి బదులుగా జై హింద్, జై భారత్ అని చెప్పాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గవర్నమెంటు స్కూల్స్ తో పాటు ఎయిడెడ్, సెల్ఫ్ ఫైనాన్స్డ్ స్కూళ్లలో ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఈ నిబంధనలు అనుసరించాలని తెలిపారు. దీంతో విద్యార్థులు ఇక నుంచి ఉపాధ్యాయులు హాజరు పిలిచినపుడు జైహింద్ లేదా జైభారత్ అంటూ పలకాలి. విద్యార్థుల్లో బాల్యం నుంచే దేశభక్తిని ప్రోత్సహించే లక్ష్యంతోనే ఈ మార్పులు తీసుకొచ్చినట్టు ప్రభుత్వం చెబుతోంది. ఈ కొత్త నిబంధనలకు రాజస్తాన్‌లోని ఒక ఉపాధ్యాయుడి నుండి స్ఫూర్తి పొందినట్లు అధికారులు చెబుతున్నారు.

గుజరాత్ ప్రభుత్వం, పాఠశాలల్లో తీసుకొచ్చిన కొత్త విధానంపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అయితే, కాంగ్రెస్ నేతలు మాత్రం ఇలాంటి నిర్ణయం వల్ల పిల్లల్లో నిర్భందంగా జాతీయ భావన పెంపొందించలేమని అంటోంది. ఎస్ సార్ కు బదులు జై హింద్, లేదా జై భారత్ అంటూ పలకడం సరికాదని ఆరోపిస్తున్నారు. విపక్షాల ఆరోపణలు ఎలా ఉన్నా కొత్త సంవత్సరం, మొదటి రోజు నుంచే గుజరాత్ ప్రభుత్వం ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories