సందడిగా విశాఖ ఉత్సవ్

సందడిగా విశాఖ ఉత్సవ్
x
Highlights

సాగర నగరిలో పుష్ప ప్రదర్శన కనువిందు చేస్తోంది. పూలసోయగాలు, ఉద్యాన సొబగులతో కట్టి పడేసింది. పూర్తిగా ఆహ్లాదాన్ని ఆనందాన్ని పంచుతోంది. రంగు రంగుల పుష్పాలు మధురానుభూతిని కల్గిస్తోంది. వేల రకాల పూలు ఒక్కచోట గూబాళిస్తూ సువసనాలు వెదజల్లుతున్నాయి. విశాఖ ఉత్సవ్ లో ఫ్లవర్ షో సందర్శకులను ఎంతగానో అలరిస్తుంది.

సాగర నగరిలో పుష్ప ప్రదర్శన కనువిందు చేస్తోంది. పూలసోయగాలు, ఉద్యాన సొబగులతో కట్టి పడేసింది. పూర్తిగా ఆహ్లాదాన్ని ఆనందాన్ని పంచుతోంది. రంగు రంగుల పుష్పాలు మధురానుభూతిని కల్గిస్తోంది. వేల రకాల పూలు ఒక్కచోట గూబాళిస్తూ సువసనాలు వెదజల్లుతున్నాయి. విశాఖ ఉత్సవ్ లో ఫ్లవర్ షో సందర్శకులను ఎంతగానో అలరిస్తుంది. సాగర తీరంలో అంగరంగం వైభవంగా జరుగుతున్న విశాఖ ఉత్సవ్ లో ప్రతి ఏటా మాదిరిగా ఈ ఏడాది స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది పుష్ప ప్రదర్శన. ఎన్నో అద్భుతమైన రీతుల్లో పుష్పాలను అలంకరించారు. విభిన్న జాతుల పువ్వులు సందర్శకులను రారమ్మని ఆహ్వానిస్తున్నాయి. రంగు రంగుల వేల పువ్వులను ఒకే దగ్గర ఆహ్లాదాన్ని పంచుతూ చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

126 జాతుల దేశ, విదేశాల పువ్వులు కొలువుదీరాయి. రెండు లక్షలకు పైగా పూల మొక్కలు ఉద్యానవనంగా తీర్చిదిద్దబడ్డాయి. వీటిలో గూలాబీ, చామంతి, మందారం, లీల్లీ, వంటి సాధరణ పుష్పాలతో పాటు హైండ్రాంజీయా, ఆర్కిడ్స్, బర్డ్ ఆఫ్ ప్యారడైజ్, డయాంథీస్, లివిస్ టోనీయా, ఆల్బీనీయా, తులిప్స్, చెర్రీ ఫ్లవర్స్ స్పెషల్ అట్రాక్షన్ అవుతున్నాయి. వీటిని చూస్తు విశాఖ ప్రజలు మైమరిచిపోతున్నారు.ఈ ఫ్లవర్ షోను ఈ సారి సెంట్రల్ పార్క్ లో ఏర్పాటు చేయడం వలన మంచి స్పందన కనిపిస్తుంది. సీటీ కి సెంటర్ గా వున్న అతి పెద్ద ఉద్యానవనం కావడంతో నేచరల్ లుక్ వస్తుంది. ముఖ్యంగా ఈ సారి ఎక్కువ రోజులు తాజాగా వుండే రకాలను ఏర్పాటు చేసారు. హృదాయకారంలో వెలకమ్ గేట్స్ ను పూల తో అలంకరించారు. విరుల అందాలను సెల్ ఫోన్స్ లో బందీ చేయడానికి నగరవాసులు పోటీ పడ్డారు. సుమారు 500 కిలోల కాప్సియమ్ పూలతో రూపొందించిన జాతీయ పక్షి నెమలి ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. విశాఖ కు సింబాలిక్ గా వుండే కైలాసగిరి శివపార్వతులు, టీయూ 142 యుద్ద విమానం, సబ్ మెరైన్, నమూనాలు అందరిని ఆకట్టుకున్నాయి. కప్ అండ్ సాసర్, పీకాక్, ఎగ్ బౌల్ ఫ్లవర్ కార్నింగ్స్ అందిరిని అలరించాయి. పుష్ప ప్రదర్శన కొత్త అందాలను తేవడంతో పాటు కొత్త ఏడాదికి గ్రాండ్ వెలకమ్ చెబుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories