గ్రామ పంచాయతీలలో కాసుల గలగల

Gram Panchayat
x
Gram Panchayat
Highlights

పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని గ్రామ పంచాయతీల గల్లా పెట్టెలు కాసుల వర్షంతో గలగలలాడుతున్నాయి. ఏళ్ల తరబడి పేరుకుపోయిన బకాయి సొమ్ము మొత్తం ఖజానాకు చేరుతున్నది.

పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని గ్రామ పంచాయతీల గల్లా పెట్టెలు కాసుల వర్షంతో గలగలలాడుతున్నాయి. ఏళ్ల తరబడి పేరుకుపోయిన బకాయి సొమ్ము మొత్తం ఖజానాకు చేరుతున్నది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు నో డ్యూస్ సర్టిఫికెట్ సమర్పించాల్సి రావడంతో ఆస్తి, నల్లా పన్నులు రూపాయి బాకీలేకుండా చెల్లిస్తున్నారు. ఎక్కువ మంది ఎన్నికల బరిలో నిలిచేందుకు పోటీ పడుతుండటంతో పన్నులు కూడా అదేస్థాయిలో వసూలవుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అరకోటికి పైగా పేరుకు పోయిన మొండి బకాయిల్లో మూడు కోట్లకు పైగా పన్నులు వసూలయ్యాయి.

స్థానిక సంస్థలకు ఎలాంటి పన్నులు బాకీ ఉన్న వారు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు నిబంధన గ్రామపంచాయతీలకు వరమైంది. పంచాయతీ పన్నులు చెల్లించాలంటూ సిబ్బంది వెంటపడినా తప్పించుకు తిరిగే వారు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల నిబంధనల పుణ్యమా ఏళ్ల తరబడిన పన్నులు ఎన్ని ఉన్నాయంచూ మరీ అడిగి చెల్లిస్తున్నారు. పంచాయతీలకు రాబడి మరింత పెరిగింది.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వెయ్యికిపైగా గ్రామ పంచాయీతల్లో ఐదేళ్లుగా కోట్లలో ఆస్తిపన్నులు పేరుకుపోయాయి. మేజర్ పంచాయతీల్లో లక్షల్లో పన్నులు వసూలవుతుండగా మైనర్ గ్రామ పంచాయతీల్లో వేలల్లో పన్నులు చెల్లిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే వారు ఎన్.ఓ.సీ తీసుకురావాలనే నిబంధనతో పన్నులు చెల్లించి నోడ్యూ సర్టిఫికెట్ తీసుకుంటున్నారు.

గ్రామపంచాయితీల్లో గెలుపు ఓటములు ఏ విధంగా ఉన్నప్పటికీ నిధులు సమకూరుతున్నాయంటున్నారు గ్రామస్థులు. ఒక్కో గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు ఇవ్వలేని సందర్భాలున్నాయి పోటీ చేసే అభ్యర్ధులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో పేరుకుపోయిన బకాయిలు వసూలవుతున్నాయి.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పెండింగ్ బకాయిల్లో ఇప్పటి వరకు 3 నుంచి 4 కోట్ల వరకు వసూలయ్యాయని చెబుతున్నారు అధికారులు. ఈనెలాఖరులోపు 50శాతం మేర పన్నులు వసూలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దులు తప్పనిసరిగా ఎన్ఓసీ తీసుకోవాల్సి ఉండటంతో మిగతా రోజులతో పోలిస్తే ఎక్కువగా పన్నులు వసూలవుతున్నాయంటున్నారు అధికారులు.

మరో వైపు నిజామాబాద్ జిల్లాలో 530 గ్రామ పంచాయతీలు ఉండగా కామారెడ్డి జిల్లాలో 528 గ్రామ పంచాయతీలతో పాటు నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలతో పాటు మేజర్, మైనర్ గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories