తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ గవర్నర్ ప్రసంగం

ESL Narasimhan
x
ESL Narasimhan
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి ఈరోజు గవర్నర్ నర్సింహన్ ప్రసంగించనున్నారు. ఉదయం పదకొండున్నరకు గవర్నర్ స్పీచ్ ప్రారంభం కానుంది. దాదాపు 40 నిమిషాలపాటు ప్రసంగించనున్న గవర్నర్‌ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ నాలుగున్నరేళ్లలో సాధించిన ప్రగతిని వివరించనున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి ఈరోజు గవర్నర్ నర్సింహన్ ప్రసంగించనున్నారు. ఉదయం పదకొండున్నరకు గవర్నర్ స్పీచ్ ప్రారంభం కానుంది. దాదాపు 40 నిమిషాలపాటు ప్రసంగించనున్న గవర్నర్‌ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ నాలుగున్నరేళ్లలో సాధించిన ప్రగతిని వివరించనున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నర్సింహన్ ప్రసంగించనున్నారు. దాదాపు 40 నిమిషాలపాటు ప్రసంగించనున్న గవర్నర్‌ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ నాలుగున్నరేళ్లలో సాధించిన ప్రగతిని వివరించనున్నారు. ముఖ్యంగా అతి తక్కువ సమయంలో వృద్ధిరేటు పెరుగుదల, వివిధ సంక్షేమ పథకాల అమలుతో యావత్‌ దేశం తెలంగాణ వైపే చూస్తోందన్న విషయాన్ని గవర్నర్ తన ప్రసంగంలో చెప్పనున్నారు. ఇక సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చిన విధానం, రైతుబంధు, రైతు బీమా పథకాలకు ఐక్యరాజ్యసమితి అవార్డు రావడాన్ని గవర్నర్‌ స్పీచ్‌లో పొందుపర్చారు. అలాగే సంక్షేమానికి 40వేల కోట్లు కేటాయించడం, సాగు-తాగునీటి ప్రాజెక్టులు, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను పరిపుష్టి చేసేందుకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న పథకాల అమలు సరళిని సభ ముందుంచనున్నారు.

ఇక ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం చేపడుతోన్న మజిలీలను విశదీకరించనున్నారు. వచ్చే ఐదేళ్లలో సంక్షేమంతోపాటు సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి, కోటి ఎకరాలను సస్యశ‌్యామలం చేసే యజ్ఞం ప్రభుత్వం ముందు ఉందనే విషయాన్ని సభకు తెలియజేయనున్నారు. అలాగే ఏప్రిల్ నుంచి పెన్షన్ల పెంపు, నిరుద్యోగ భృతి అమలు, ఉద్యోగుల రిటైర్మెంట్ వయో పరిమితి పెంపు, ఉద్యోగాల భర్తీ వంటి అంశాలు గవర్నర్ ప్రసంగంలో ఉండబోతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories