టిక్‌టాక్‌కు దండేశారు!

టిక్‌టాక్‌కు దండేశారు!
x
Highlights

టిక్ టాక్ యూజర్లకు, ఫ్యాన్స్‌కు షాక్ తగిలిన విషయం తెలిసిందే. గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి టిక్ టాక్ యాప్ మాయమైంది. టిక్ టాక్ యాప్‌ను...

టిక్ టాక్ యూజర్లకు, ఫ్యాన్స్‌కు షాక్ తగిలిన విషయం తెలిసిందే. గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి టిక్ టాక్ యాప్ మాయమైంది. టిక్ టాక్ యాప్‌ను నిషేధించాలన్న మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు చైనీస్ వీడియో షేరింగ్ యాప్ మాయమైంది. ఇక ఎవరూ గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాపిల్ యాప్ స్టోర్ నుంచి టిక్ టాక్ యాప్‌ను కొత్తగా డౌన్‌లోడ్ చేసుకోనే ఛాన్స్‌ లేకపోవడంతో టిక్ టాక్ యూజర్లుఉసూరుమంటున్నారు. ఇండియాలో పాపులర్ అయిన టిక్ టాక్ యాప్ యాక్సెస్ ఇక లేనట్టే దీన్ని బ్లాక్ చేస్తున్నట్టు గూగుల్ ప్రకటించింది. టిక్ టాక్‌పై వివాదాలు న్యాయస్థానాల తీర్పుల నేపథ్యంలో ఈ యాప్ బ్యాన్ అయ్యింది.

అయితే సుప్రీంకోర్టు తీర్పుతో కొందరు నెటిజన్లు నిరుత్సాహానికి గురవుతున్నారు.మరికొందరు వెరైటీగా టిక్ టాక్ ఫొటోకు దండేసి నివాళులు అర్పిస్తున్నారు. ఇప్పడు అన్ని సోషల్‌మీడియా ఖాతాల్లో ప్రస్తుతం ఈ ఫొటోలు హల్‌చల్ చేస్తున్నాయి. యువతీయువకుల్లో టిక్ టాక్ వీడియో షేరింగ్ యాప్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు డైలాగ్స్, ఎమోషన్స్, సాంగ్స్ ఇలా అన్ని రకాల ఎంటర్‌టైన్లు ఉన్న ఈ యాప్ యువతను విపరీతంగా ఆకర్షించింది. కేవలం ఒక్క భారత్ లోనే టిక్ టాక్ యాప్‌ను దాదాపు 240 మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. కాగా ఈ ఏడాది ఒక్క జనవరిలోనే 30 మిలియన్ల మంది ఇన్‌స్టాల్ చేసుకున్నారు. గూగుల్, యాపిల్ తర్వాత అత్యంత ప్రజాధారణ పొందిన యాప్ టిక్ టాక్. ప్రపంచంలోనే ఈ యాప్ మూడో స్థానంలో ఉన్నది.







Show Full Article
Print Article
Next Story
More Stories