ఈవీఎం లపై ఎలాంటి అపోహలు అవసరం లేదు: ద్వివేది

ఈవీఎం లపై ఎలాంటి అపోహలు అవసరం లేదు: ద్వివేది
x
Highlights

ఈవీఎం లపై ఓటర్లకు ఎలాంటి అపోహలు అవసరం లేదన్నారు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది. ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్‌లో తాము ఎవరికి ఓటు వేసిందీ...

ఈవీఎం లపై ఓటర్లకు ఎలాంటి అపోహలు అవసరం లేదన్నారు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది. ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్‌లో తాము ఎవరికి ఓటు వేసిందీ సరిచూసుకోవచ్చన్నారు. రెండు, మూడు రోజుల్లో ఎన్నికల పరిశీలకులు రాష్ర్టానికి రానున్నట్లు చెప్పారు. ఈ నెల 25న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాను అన్ని రాజకీయ పార్టీలకూ అందజేస్తామన్నారు. వాటితోపాటు కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన 200 మంది ఎన్నికల పరిశీలకుల వివరాలు, ఫోన్‌ నెంబర్లు కూడా ఇస్తామన్నారు. రాష్ట్రంలో 3 కోట్ల 93లక్షల 45 వేల 717 ఓటర్లు ఉన్నారని చెప్పారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత అసెంబ్లీకి 2,395 మంది అభ్యర్థులు, పార్లమెంటుకు 344 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నట్లు ఎన్నికల అధికారి వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories