కొండెక్కిన బంగారం ధరలు

కొండెక్కిన బంగారం ధరలు
x
Highlights

బంగారం అంటే భారతీయులకు ఎంత మక్కువో చెప్పనవసరం లేదు. అలాంటి కనకం ఇప్పుడు కొండెక్కింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధర భారీగా పెరిగింది. రాబోయే...

బంగారం అంటే భారతీయులకు ఎంత మక్కువో చెప్పనవసరం లేదు. అలాంటి కనకం ఇప్పుడు కొండెక్కింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధర భారీగా పెరిగింది. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా పసిడి ధరలు ఆకాశానంటాయి. అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ ధర ఔన్సు 15 వందల డాలర్లకు చేరుకుంది.

మన దేశంలో 10 గ్రాముల బంగారం 38 వేల 500 రూపాయలకు చేరుకుంది. రెండ్రోజుల్లో బంగారం రేటు ఒక వెయ్యి 663 రూపాయలు పెరిగింది. అమెరికా - చైనా ట్రేడ్ వార్, మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న రాజకీయ సంక్షోభంతో బంగారం ధర భారీగా పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. గత ఏడాది ఇదే నెలలో 10 గ్రాముల బంగారం 30 వేలు ఉండగా.. ఇప్పుడు ఏకంగా 8 వేల రూపాయలు పెరిగింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ ఏడాది మరో 15 శాతం పెరిగే అవకాశం వుందంటున్నారు. మరోవైపు ధర పెరిగినా శ్రావణ మాసం కావడంతో బంగారం కొనుగోలు చేయకతప్పడం లేదంటున్నారు కొనుగోలు దారులు. పసిడి ధర భారీగా పెరగడంతో సామాన్యులు బంగారం కొనలేని పరిస్థితి నెలకొంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories