రసవత్తరంగా గోవా రాజకీయాలు... ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత సీన్ కాంగ్రెస్‌కి ఉందా?

రసవత్తరంగా గోవా రాజకీయాలు... ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత సీన్ కాంగ్రెస్‌కి ఉందా?
x
Highlights

గోవా సీఎం మనోహర్ పారికర్ మృతితో ఆ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయి. రాష్ట్ర గవర్నర్ మృదుల సిన్హాను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ...

గోవా సీఎం మనోహర్ పారికర్ మృతితో ఆ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయి. రాష్ట్ర గవర్నర్ మృదుల సిన్హాను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు చంద్రకాంత్ కవ్లేకర్ నేత్రుత్వంలోని 14మంది కాంగ్రెస్ నేతలు రాజ్‌భవన్‌‌లో గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో తమదే అతిపెద్ద పార్టీ అని కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌తో చెప్పారు.

పారికర్ సీఎంగా ఉంటారన్న నిబంధనతోనే మిగతా పార్టీలు బీజేపీకి మద్దతునిచ్చాయని ఇప్పుడాయన లేకపోవంతో సంకీర్ణ ప్రభుత్వం కొనసాగే అవకాశం లేదని కాంగ్రెస్ తమ లేఖలో గవర్నర్‌కు తెలియజేసింది. పారికర్ మృతి తర్వాత బీజేపీ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వానికి అధికారంలో ఉండే అవకాశం లేదని ప్రస్తుత పరిస్థితుల్లో తమదే రాష్ట్రంలో అతిపెద్ద పార్టీ అయినందునా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరినట్టు కవ్లేకర్ చెప్పారు. నిజానికి గవర్నరే తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందని కానీ ఇప్పటికీ తాము ఆమె అపాయింట్‌మెంట్ కోసం కష్టపడాల్సి వస్తుందని వాపోయారు.

గోవా అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 40. ఇందులో కాంగ్రెస్ బలం 17మంది ఎమ్మెల్యేలు కాగా బీజేపీకి 13మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గోవా ఫార్వర్డ్ పార్టీ(GFP), మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ(MGP)లకు చెరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో ముగ్గురు స్వంతత్ర ఎమ్మెల్యేలు ఒక నేషనల్ కాంగ్రెస్ పార్టీ(NCP) ఎమ్మెల్యే ఉన్నారు. ఎన్‌సీపీ మినహా మిగతా పార్టీలు, స్వంతంత్ర ఎమ్మెల్యేలు మనోహర్ పారికర్ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు.

బీజేపీ ఎమ్మెల్యే ఫ్రాన్సిస్ డిసౌజా ఈ ఏడాది ప్రారంభంలోనే చనిపోవడం, తాజాగా మనోహర్ పారికర్ కన్నుమూయడం, కాంగ్రెస్‌కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సుభాష్ శిరోద్కర్, దయానంద్ పార్టీకి రాజీనామా చేయడంతో గోవా అసెంబ్లీలో ప్రస్తుత ఎమ్మెల్యేల సంఖ్య 36కి పడిపోయింది. బీజేపీకి ప్రస్తుతం 11మంది ఎమ్మెల్యేలు ఉండగా కాంగ్రెస్‌కు 14మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పారికర్ సీఎంగా ఉంటారన్న నిబంధనతోనే మిగతా పార్టీలు బీజేపీకి మద్దతునిచ్చాయని ఇప్పుడాయన లేకపోవంతో సంకీర్ణ ప్రభుత్వం కొనసాగే అవకాశం లేదని కాంగ్రెస్ తమ లేఖలో గవర్నర్‌కు తెలియజేసింది. కాబట్టి రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ఉన్న తమకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని కోరుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories