Top
logo

ప్రభుత్వ లాంఛనాలతో మనోహర్‌ పారిక‌ర్‌ అంత్యక్రియలు పూర్తి

ప్రభుత్వ లాంఛనాలతో మనోహర్‌ పారిక‌ర్‌ అంత్యక్రియలు పూర్తి
X
Highlights

అనారోగ్యంతో మృతి చెందిన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. మిరామార్ బీచ్‌లో పారికర్ ...

అనారోగ్యంతో మృతి చెందిన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. మిరామార్ బీచ్‌లో పారికర్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. తమ అభిమాన నేతకు చివరి సారిగా వీడ్కోలు పలికేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. పారికర్ అంతిమయాత్రలో ప్రజలు పాల్గొన్నారు. అంతకుముందు ప్రజల సందర్శనార్థం కాలా అకాడమీలో పారికర్ భౌతికకాయాన్ని ఉంచారు. ఇక్కడే ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులు పారికర్ భౌతికకాయం వద్ద నివాళులు అర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Next Story