50 కోట్లు ఇస్తే మోడీని చంపేస్తా...వైరల్ అవుతోన్న మాజీ సైనికుడి వీడియా

50 కోట్లు ఇస్తే మోడీని చంపేస్తా...వైరల్ అవుతోన్న మాజీ సైనికుడి వీడియా
x
Highlights

ప్రధాని నరేంద్రమోడీపై వారణాసిలో పోటీకి దిగిన బీఎస్ఎఫ్ మాజీ జవాను తేజ్ బహదూర్‌‌కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు పెను సంచలనమైంది. తనకు రూ.50 కోట్లు ఇస్తే...

ప్రధాని నరేంద్రమోడీపై వారణాసిలో పోటీకి దిగిన బీఎస్ఎఫ్ మాజీ జవాను తేజ్ బహదూర్‌‌కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు పెను సంచలనమైంది. తనకు రూ.50 కోట్లు ఇస్తే ప్రధాని నరేంద్రమోదీని చంపేస్తానని బహదూర్ అందులో పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం నాటిదిగా భావిస్తున్న ఈ వీడియోలో ఉన్నది తానేనని తేజ్ బహదూర్ అంగీకరించాడు. అయితే, దీని వెనక కుట్ర ఉందని బహదూర్ ఆరోపించాడు. అయితే, వీడియో రెండేళ్లనాటిది కావడంతో దాని విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సంచలనం సృష్టిస్తున్న ఈ వీడియోపై బీజేపీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇటువంటి సంఘ విద్రోహ శక్తుల వెనక ఉన్నది కాంగ్రెస్సేనని ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. మోదీపై నామినేషన్ వేసిన వ్యక్తే ఆయన హత్యకు కుట్ర పన్నడం తనను షాక్‌కు గురిచేసిందన్నారు. మోదీని ఎదుర్కోలేకే ప్రతిపక్ష పార్టీలు ఇలాంటి హింసా మార్గాలను ఎంచుకుంటున్నాయని ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories