ప్రాంక్ చేసి తన గర్ల్ ఫ్రెండ్‌ని ఏడిపిద్దామనుకొని ... చివరకు

ప్రాంక్ చేసి తన గర్ల్ ఫ్రెండ్‌ని ఏడిపిద్దామనుకొని ... చివరకు
x
Highlights

ఈ మధ్యకాలంలో ప్రాంక్ వీడియోలకు సోషల్ మీడియాలో తెగ పాపులారిటీ లభిస్తోంది. య్యూట్యూబ్ నుంచి ప్రాంక్ వీడియోలు తీసి పోస్ట్ చేస్తే లక్షల్లో వ్యూస్...

ఈ మధ్యకాలంలో ప్రాంక్ వీడియోలకు సోషల్ మీడియాలో తెగ పాపులారిటీ లభిస్తోంది. య్యూట్యూబ్ నుంచి ప్రాంక్ వీడియోలు తీసి పోస్ట్ చేస్తే లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. యువత మొత్తం ప్రాంక్ వీడియోలు తీసి పావులారిటీ తెచ్చుకున్నారు. అయితే ఈ ప్రాంక్ వీడియోల ద్వారా అప్పుడప్పుడు ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయి. కాగా ఇంగ్లాండ్‌లో ఓ వ్యక్తి ప్రాంక్ వీడియో చేసి తన ప్రేయసిని సరదగా ఆడపట్టిందం అని అనుకున్నాడు కానీ చివరకు ఆ సరద కాస్తా తన ప్రాణాలనే పోగొట్టుకున్నాడు. స్టఫార్డ్‌షైర్‌కు చెందిన డేనీ మున్రో‌కు ప్రాంక్ వీడియోలు చేయడం అంటే అతనికి ఎంతో మక్కువ. అలా చాలా సందర్భల్లో ప్రాంక్ వీడియోలు తీసి తన గర్లఫ్రెండ్‌ని ఆటపట్టిస్తుండే వాడు డేనీ మున్రో‌. అయితే ఒకసారి కూడా తనపై టొమాటో కెచప్ వేసుకుని ఎవరో తనను పొడిచేశారని తనను ఏడిపించాడంటూ తన గర్ల్‌ఫ్రెండ్ చెప్పింది. గతేఏడాది ఆగస్టు 1వ తేదీన మేంఇద్దరం షాపింగ్ చేసి ఇంటికొచ్చామని డేనీ తన గదిలో టీవీ చూడటానికి వెళ్లిపోయాడని గర్ల్‌ఫ్రెండ్ అమీ పేర్కొంది.

అయితే ఒక్కసారిగా ఏం అయిందో ఎమో తెలియదు కానీ కాసేపటి తరువాత తన గదికి వెళ్లి చూస్తే తన ప్యాంటుతో ఎదురుగా కనిపించాడని అమీ వివరించింది. అయితే ఎప్పటిలాగే తనను ఏడిపించడానికే ప్రాంక్ చేశాడేమో అనుకొని తను కూడా లైట్ తీసుకుంది. అయితే ఈ సందర్భంలోనే డేనీని తన గర్ల్ ఫ్రెండ్ సరదగా ఇక చాలుకానీ కిందకు దిగు అని అని చెప్పింది అయితే ఎంతసేపటికి కూడా తను ఎలాంటి స్పందన లేకపోవడంతో ఒక్కసారిగా తను కంగుతిన్నది. ఎంత అరిచినా కానీ స్పందన లేదని డేనీ ముఖం కూడా నీలం రంగులోకి మారిపోవడంతో తనకు ఏం చేయాలో తోచలేదని చెప్పింది. వెంటనే డేనీని కిందకు దింపి హుటాహుటినా దగ్గర్లో ఉన్న ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. డేనీ అప్పటికే తన ప్రాణాలు గాలిలో విడిచిపెట్టారని వైద్యులు వెల్లడించారు. కాగా ఎప్పటిలాగే తనను ఏడిపించడానికే డేనీ ఉరి వేసుకున్నట్టు ప్రాంక్ చేద్దామనుకుని తను ప్రాణాలను విడిచిపెట్టారని అమీ చెప్పింది. కాగా దీనిపై డేనీ తల్లి మాట్లాడుతూ తన కొడుకు ఎంతో దైర్యవంతుడని ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని చెప్పుకొచ్చింది. డేనీకి ఎలాంటి కష్టాలు కూడా లేవని తల్లి కూడా పోలీసులకు వివరించింది. ప్రాంక్ చేద్దామని చివరకు తన ప్రాణాలనే పొగొట్టుకున్నాడు. ఇకనైనా ప్రాంక్ చేసుకొవాలి కానీ సాహసం చేసి ప్రాణాలు వీడిచిపెట్టేలా ప్రయోగాలు చేయవద్దని పలువురు సూచిస్తున్నారు.





Show Full Article
Print Article
Next Story
More Stories