కుస్తీ పోటీల్లో సత్తా చాటిన బాలిక

కుస్తీ పోటీల్లో సత్తా చాటిన బాలిక
x
Highlights

కుస్తీ పోటీల్లో పురుషులతో పాటు సమానంగా మహిళలు రాణిస్తారని నిరూపించింది ఓ బాలిక. మహశివరాత్రి సందర్భంగా నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూరాలో కుస్తీ...

కుస్తీ పోటీల్లో పురుషులతో పాటు సమానంగా మహిళలు రాణిస్తారని నిరూపించింది ఓ బాలిక. మహశివరాత్రి సందర్భంగా నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూరాలో కుస్తీ పోటీలు నిర్వహించారు. కుస్తీ పోటీలు అనగానే పురుషుల క్రీడ అనుకుంటారు అంతా కానీ ఈ పోటీల్లో పురుషులతో పోటీపడింది మహారాష్ర్టకు చెందిన మహిమా రాథోడ్ అనే బాలిక.

మహారాష్ర్టలోని యావత్మల్ జిల్లా పూసత్ తాలుగా దుర్గాగిరి గ్రామానికి చెందిన పదిహేడేల్ల మహిమ రాథోడ్ కుస్తీ పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. తొమ్మిది సంవత్సరాలుగా కుస్తీ పోటీల్లో పాల్గొంటూ వస్తోంది మహిమ రాథోడ్. పాల్గొన్న ప్రతి పోటీలోనూ విజయపథంలో నిలిచింది. పురుషులతో జరిగిన పోటీలో గెలుపొందిన మహిమా రాథోడ్ కు ఐదు వేల రూపాయల నగదు బహుమతి ఇచ్చారు నిర్వాహకులు.


Show Full Article
Print Article
Next Story
More Stories