Top
logo

బావర్చి హోటల్‌ సీజ్‌

బావర్చి హోటల్‌ సీజ్‌
X
Highlights

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో బావర్చి హోటల్‌‌ను జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం మధ్యాహ్నం సీజ్ చేశారు.

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో బావర్చి హోటల్‌‌ను జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం మధ్యాహ్నం సీజ్ చేశారు. హోటల్‌లో బల్క్‌ గార్బేజ్‌ జనరేట్‌ సిస్టం ఏర్పాటు చేయాలని గతేడాది నవంబర్ 25న జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే నెలరోజులు గడువిచ్చినా బల్క్‌ గార్బేజ్‌ సిస్టం ఏర్పాటు చేయకపోవడంతో ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని బావర్చి హోటల్‌‌ను ఈరోజు సీజ్‌‌ చేశారు. జీహెచ్ఎంసీ సర్కీల్-15 ఏఎంహెచ్‌వో డా.హేమలతమ నేతృత్వంలో అధికారులు, సిబ్బంది కలిసి బావర్చి హోటల్‌ను సీజ్ చేశారు. అనంతరం హేమలత మీడియాతో మాట్లాడుతూ చాలకాలంగా హోటర్ యాజమాన్యానికి తడి,పొడి చెత్తను వేరు చేయాలని, ఆర్గానిక్ వేస్ట్ కన్వర్టర్ యంత్రాన్ని పెట్టుకోవాలని చెప్పినా కాని మా మాట వినిపించుకోకుండా వ్యర్థలను మ్యాన్ హోల్‌లోకి వదులుతున్నరని హేమలత ఆగ్రహాం వ్యక్తం చేశారు.


Next Story